రోహిత్, కొహ్లీకి బీసీసీఐ బిగ్ షాక్..! తలో రెండు కోట్లు కట్ ?
టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీకి బీసీసీఐ భారీ షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి తప్పుకుని వన్డే టీమ్ లో మాత్రమే కొనసాగుతున్న వీరిద్దరికీ అక్కడా కష్టాలు తప్పడం లేదు. ఆడితే జట్టులో ఉండండి, లేకపోతే తప్పుకోండి అని ఎప్పటికప్పుడు బీసీసీఐ సంకేతాలు ఇస్తూనే ఉంది. దీంతో పాటు వన్డేల్లో విఫలమైతే దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ కండిషన్లు పెడుతోంది. దీంతో అతి కష్టం మీద వన్డేల్లో కొనసాగుతున్న వీరిద్దరికీ బీసీసీఐ మరో షాక్ రెడీ చేసింది.
బీసీసీఐ ఏటా టీమిండియా ఆటగాళ్లను నాలుగు విభాగాలుగా విభజించి కాంట్రాక్టుల్ని ఇస్తుంది. ఈ కాంట్రాక్టులు దేశంలోని మేటి క్రికెటర్లను జాతీయ జట్టులో కొనసాగేలా చేసే ఒప్పందాలు. అయితే ఈ ఒప్పందం స్వభావం, దానితో వచ్చే పారితోషికం క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఆటగాళ్లు అందించే సహకారంపై ఆధారపడి ఉంటుంది. అంటే మూడు ఫార్మాట్లూ ఆడితేనే ఈ కాంట్రాక్టుల్లో వారి స్ధానాలు కాపాడుకుని ఆ స్ధాయిలో పారితోషకాలు అందుకోవచ్చు. లేకపోతే అంతే సంగతులు.

అయితే చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇచ్చింది. త్వరలో వీటిని సవరించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ లెక్కన మూడు ఫార్మాట్లలో కేవలం ఒకే ఫార్మాట్ (వన్డేలు) మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీని ప్రస్తుతం వారు ఉన్న ఏ ప్లస్ కేటగిరీ నుంచి తప్పించి ఏ కేటగిరీలోకి పంపేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. అదే జరిగితే వీరు ఏడాదికి తలో రెండు కోట్లు చొప్పున కోల్పోతారు.

బీసీసీఐ కాంట్రాక్టులు ఏ ప్లస్, ఏ, బీ, సీలుగా ఉంటాయి. ప్రతీ విభాగంలో జీతాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ మొత్తాన్ని వారు ఏడాది పొడవునా ఎన్ని మ్యాచ్‌లు ఆడినా, వారి మ్యాచ్-ఫీజు సంపాదనకు అదనంగా చెల్లిస్తారు. అయితే గ్రేడ్ల కేటాయింపు అనేది బీసీసీఐ ఏటా సమీక్షిస్తుంది. సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్, జట్టు కెప్టెన్‌తో సంప్రదించి దీన్ని ఖరారు చేస్తుంది. ఇందులో టెస్టులు ఆడే వారికి ఏ ప్లస్ లో ఉంచుతారు. ఈ లెక్కన టెస్టులు ఆడని కొహ్లీ, రోహిత్ ఏ ప్లస్ కోల్పోవడం ఖాయం. అలాగే టెస్టు కెప్టెన్ గా మారిన శుభ్ మన్ గిల్ కు ఏ ప్లస్ దక్కబోతోంది. ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరీ ఆటగాళ్లకు 7 కోట్లు చెల్లిస్తున్నారు. అలాగే ఏ కేటగిరీలో ఆటగాళ్లకు ఐదు కోట్లు దక్కుతోంది. రోహిత్, కొహ్లీ ఏ కేటగిరీకి డిమోట్ అయితే 2 కోట్లు కోల్పోతారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications