IND vs SA: ప్రతీకారం తీర్చుకున్న ప్రోటీస్-భారత్ ఘోర ఓటమి..!!
చండీగఢ్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ టీట్వంటీలో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రోటీస్ విధించిన 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... చేధించే క్రమంలో తడబడింది. తొలి టీట్వంటీలో 4 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్... రెండవ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. ఇక తిలక్ వర్మ బ్యాట్‌కు పని చెప్పినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
రఫాడించిన డీకాక్
అంతకుముందు టాస్ గెలిచి సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక బరిలోకి దిగిన ప్రోటీస్ బ్యాట్స్‌మెన్ ఓపెనర్ డికాక్ రెచ్చిపోయాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ 8 పరుగులు చేసి వరుణ్ ధవన్ వేసిన తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన మార్క్రమ్ 26 బంతుల్లో 29 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే అక్సర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఓ వైపు వికెట్లు పడిపోతున్నప్పటికీ ఓపెనర్ డికాక్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 46 బంతుల్లో 7 సిక్సులు,4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.ఇక చివర్లో ఫెరీరా, మిల్లర్లు బ్యాట్‌ను ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 213 పరుగులు చేసి భారత్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ముందుంచింది.
మరోవైపు భారత బౌలర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా అర్షదీప్ వేసిన 3వ ఓవర్లో ఏకంగా ఏడు వైడ్లు వేసి ఆ ఓవర్‌లో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా అక్సర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. బుమ్రా కూడా బంతితో ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా భారత బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు.
టీమిండియా బ్యాట్స్‌మెన్ ఫెయిల్
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా...చకచకా వికెట్లను కోల్పోయింది. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. దూకుడుగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ 17 పరుగుల వద్ద పెవీలియన్ చేరగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులతో నిరాశపర్చాడు. బంతిని బాదుతాడని అక్సర్ పటేల్‌ను పంపగా 21 బంతుల్లో 21 పరుగులు చేసి బార్ట్‌మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.హార్థిక్ పాండ్య టచ్‌లోకి వచ్చాడనుకున్న సమయంలో సిపమ్లా వేసిన బంతిని సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి 20 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక తిలక్ వర్మతో జత కట్టిన జితేష్ శర్మ (27) చూడచక్కని షాట్లతో మెప్పించినప్పటికీ సిపామ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. శివం ధూబే 1 పరుగు మాత్రమే చేసి బార్ట్‌మాన్‌కు చిక్కాడు.తిలక్ వర్మ ఒంటరి పోరు వృథాగా మారింది. దీంతో 162 పరుగులకే భారత్ కుప్ప కూలింది.
మంచు ప్రభావంతో బంతిపై బౌలర్లు నియంత్రణ కోల్పోతారని అంతా భావించినప్పటికీ ప్రోటీస్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు.బార్ట్‌మ్యాన్ 4 వికెట్లు పడగొట్టగా యాన్‌సేన్, సిపామ్ల, చెరో రెండు వికెట్లు పడగొట్టరు. మొత్తానికి తొలి టీట్వంటీలో ఘోరంగా ఓడిన ప్రోటీస్ రెండో టీట్వంటీలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి విజయం సాధించడమే కాకుండా 5 టీట్వంటీల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications