పాకిస్తాన్ మ్యాచ్ పై మా వ్యూహమిదే- తేల్చేసిన సూర్యకుమార్ యాదవ్..!
వచ్చేవారం ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంకోలోని కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు మద్దతుగా ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తోంది. అయితే ఈ హెచ్చరికల్ని నేరుగా ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేయకుండా తమ ప్రభుత్వానికి చెప్పి చేయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అయితే పాకిస్తాన్ మ్యాచ్ బాయ్ కాట్ హెచ్చరికలపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (surya kumar yadav) ఇవాళ తొలిసారి స్పందించాడు.
టీ20 వరల్ట్ కప్ టోర్నమెంట్ కు ముందు జరిగిన కెప్టెన్ల సూర్యకుమార్ పాకిస్తాన్ తో మ్యాచ్, బాయ్ కాట్ హెచ్చరికలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మైదానంలోకి దిగడానికి నిరాకరించినప్పటికీ, భారత్ మాత్రం తమ ప్రణాళిక ప్రకారం కొలంబోకు వెళ్తుందని, మ్యాచ్కు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశాడు. జరుగుతున్న పరిణామాలకు బాధ్యత తమది కాదన్నాడు. తమ మనస్తత్వం చాలా స్పష్టంగా ఉందన్నాడు.

తాము వారితో ఆడటానికి నో చెప్పలేదని, వారే నో చెప్పారని సూర్యకుమార్ గుర్తుచేశాడు. తమ విమానాలు బుక్ చేసుకున్నామని, కొలంబోకు వెళ్తున్నామని సూర్య వెల్లడించాడు. తమ మ్యాచ్లు సిద్ధంగా ఉన్నాయన్నాడు. తొలుత అమెరికాతో, ఆ తర్వాత కెనడాతో ఆడతామని, ఆ తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం కొలంబోకు వెళ్తామన్నాడు. తద్వారా ఈ టోర్నీలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు తాము మైదానానికి వెళ్లడం ఖాయమని, పాకిస్తాన్ ఆడేందుకు ముందుకు రాకపోతే తదుపరి చర్యలు ఐసీసీ తీసుకుంటుందనేది సూర్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది.
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications