లేఆఫ్స్ అసలు సమస్య ఏఐ కాదు-అదే..! ఆర్బీఐ మాజీ గవర్నర్ షాకింగ్..!
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాల కోతలకు కారణమైన కృత్రిమ మేథపై మన దేశంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. పలు దేశాల్లో ఆర్ధికవ్యవస్దలతో పోలిస్తే బలంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధ అన్ని సంక్షోభాల్ని తట్టుకుని నిలబడుతుంటే ఏఐ మాత్రం ఇక్కడి ఉద్యోగాల్ని ఇంత సలువుగా మింగేస్తున్న వైనంపై ఆర్ధిక వేత్తలు సైతం చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ దీనికి గల అసలు కారణం చెప్పారు.
ఏఐ కారణంగా ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేథ వల్ల చేతితో చేసే ఏ ఉద్యోగమూ పోదని రఘురాం రాజన్ వెల్లడించారు. అయితే మన దేశంలో విచ్చిన్నమైన విద్యా వ్యవస్ధ ఆ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్దితుల్లో ఉండదని ఆయన హెచ్చరించారు. దేశంలో శ్రామిక శక్తిని కాపాడుకునేందుకు అత్యవసర సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

మన దేశం తక్కువ శిక్షణ పొందిన, చాలా సందర్భాలలో పోషకాహార లోపం ఉన్న శ్రామిక శక్తితో ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు పయనిస్తోందని కుశాల్ లోధాతో పాడ్‌కాస్ట్‌లో రాజన్ తెలిపారు. భారత్ తన యువతను పనికి ఎలా సిద్ధం చేస్తుందనే దానిపై జాతీయ స్ధాయిలో పునరాలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం విద్యా డిగ్రీలపై కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలపై స్పష్టమైన దృష్టితో దీన్ని ప్రారంభించాలన్నారు. ఏఐ యుగంలో ఇప్పటికీ ప్లంబర్ వంటి చేత్తో చేసే ఉద్యోగం మాత్రం పోకపోవచ్చని ఆయన తేల్చేశారు.

ప్లంబింగ్, ఎయిర్ క్రాప్ట్ ఇంజిన్ రిపేర్ వంటి పలు ఉద్యోగాలు ఆటోమేషన్ కు నిరోధంగా, పనికి ఉదాహరణగా ఉన్నాయని రఘురామ్ రాజన్ తెలిపారు. కానీ భారతదేశ ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ముఖ్యమైన ఉద్యోగాలకు అర్హత సాధించడానికి ప్రాథమిక నైపుణ్యాలైన గణితం, సైన్స్, కమ్యూనికేషన్ తో సన్నద్ధం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి దీనిపై దేశం దృష్టిసారించాలన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications