AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్-గడువు పెంపు..!
ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఈఏపీసెట్ (AP EAPCET 2026)కు ఈ ఏడాది కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెట్ కన్వీనర్ గా ఉన్న కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ మోహన్ రావు ఇవాళ వివరాలు వెల్లడించారు. అభ్యర్ధులు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే ఆలస్య రుసుముతో ఎప్పటివరకూ దరఖాస్తు చేసుకోవచ్చో తెలిపారు.
ఈ ఏడాది ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్ధులకు గడువును ఈ నెల 24 వరకూ పెంచుతున్నట్లు సెట్ కన్వీనర్ ఇవాళ ప్రకటించారు. అలాగే ఆలస్య రుసుములతో ఆ తర్వాత కూడా ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకూ, 2 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే 4 వేలు కడితే ఏప్రిల్ 6వ తేదీవరకూ, 10 వేలు కడితే ఏప్రిల్ 10 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.

అలాగే దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏప్రిల్ 11 నుంచి 13 వరకూ అవకాశం కల్పిస్తామని సెట్ కన్వీనర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/eapcet/Eapcet/EAPCET_HomePage వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ఫలితాలు కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. కాబట్టి అభ్యర్ధులు ఈఏపీసెట్ రాసే అభ్యర్ధులు ఈ వెబ్ సైట్ ను తప్పక ఫాలో కావాల్సి ఉంటుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications