Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2025: ఈ ఏడాది వర్క్ ప్లేస్ పై జెన్ జీ మార్క్..! ఎలా మార్చేశారంటే ?

ఏఐ రాకతో భారత్ లో ఈ ఏడాది ఐటీ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే అదే సమయంలో కీలక మార్పులూ చోటు చేసుకున్నాయి. ఓవైపు లేఆఫ్స్, మరోవైపు ఏఐ ఉద్యోగాల డిమాండ్ కొనసాగింది. అయితే ఈ రెండూ కాకుండా సైలెంట్ గా మరో మార్పూ కనిపించింది. అదే వర్క్ ప్లేస్ (ఆఫీసులు)పై జెన్ జీ ఉద్యోగుల ప్రభావం. వారు కోరుకుంటున్న పని సంస్కృతి, దాన్ని ఆయా కంపెనీలు ప్రతిస్పందిస్తున్న తీరు కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచింది.

ఈ ఏడాది టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న జెన్ జీ ఉద్యోగులు తమ కొత్త ద్పక్పథంతో తాము పనిచేస్తున్న సంస్థల ఆలోచన విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పని సంస్కృతి విషయంలో వారు ఈ మార్పు తీసుకొచ్చారు. మన దేశంలో ఈ ఏడాది జెన్ జీలో కేవలం 16 శాతం మంది మాత్రమే సాంప్రదాయ ఫుల్ టైమ్ ఉద్యోగాల్ని ఇష్టపడుతున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 30 శాతంగా ఉంది.

Year Ender 2025 Gen Z s Great Reset How Full-Time with a Side Hustle is Changing the Workspace

అలాగే ఈ ఏడాది ఉద్యోగాలపై జెన్ జీ చూపిన మరో ప్రభావం సైడ్ హజిల్. అంటే ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలతో పాటు సైడ్ ఉద్యోగాలు చేయడం, మూన్ లైటింగ్ వంటివి అన్నమాట. అదనపు ఆదాయం కోసం ఈ ఏడాది జెన్ జీ వీటిని ఎక్కువగా ఎంచుకోవడం కనిపించింది. ఇంకా మరికొందరు అయితే రెగ్యులర్ పనివేళలు, జీతంలో మార్పు లేని ఉద్యోగాల్ని వదిలిపెట్టి ఇలాంటి ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల వైపు మారిపోయారు. భారత్ లో ఇలా 43 శాతం మంది జెన్ జీలు సైడ్ హజిల్ కోరుకుంటే, ప్రపంచంలో కేవలం 31 శాతం మందే వీటిని కోరుకున్నారు. అలాగే వీరు తాము చేస్తున్న ఉద్యోగాల్లో ఏడాది కంటే తక్కువే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. వీరితో పోలిస్తే మిలీనియల్స్ 23 శాతం, జెన్ ఎక్స్ 14 శాతం మాత్రమే ఇలా చేశారు.

అలాగే కెరీర్ ఎంచుకొనేటప్పుడు సైతం జెన్ జీ తరం సంప్రదాయ ప్రోత్సాహకాలు ఇచ్చే కంపెనీల కంటే స్పష్టమైన బహుమతిలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇచ్చే వాటినే ఎంచుకున్నారు. ఇందులో 37 శాతం మంది మెరుగైన జీతం, 25 శాతం మంది అనుకూల షిఫ్ట్ లు, 22 శాతం మంది వర్క్ -లైఫ్ బ్యాలెన్స్, 25 శాతం కెరీర్ లో గ్రోత్, 24 శాతం మంది నైపుణ్యాలకు ప్రాధాన్యమిచ్చారు. 82 శాతం మంది జెన్ జీలు ఏఐపై ఆసక్తిగా ఉన్నారు. 44 శాతం మంది ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. 52 శాతం మంది ఏఐ టూల్స్ కు మారిపోతుంటే, 47 శాతం జాబ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

Year Ender 2025 Gen Z s Great Reset How Full-Time with a Side Hustle is Changing the Workspace

78 శాతం మంది జెన్ జీ ఉద్యోగులు సామాజిక బంధాలు (సోషల్ రిలేషన్స్) కోరుకుంటుంటే, 54 శాతం మంది ఒంటరితనంతో ఉద్యోగాల్ని వదిలేశారు. అలాగే కంపెనీల్లో కేఫెటేరియాలు వీరికి రిలేషన్స్ పెంచుకోవడానికి పనికొచ్చాయి. అంటే కంపెనీలు హైబ్రిడ్ సెటప్ లు, ఇతర మార్గాలతో వారిని ఆకర్షించడానికి, కొనసాగించడానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+