వైరల్ వీడియో: ఛీ..ఛీ.. తిరుమల కొండపై ఇదేం పని..!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం, ఏడుకొండలపైన వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తుంటారు. అంతటి విశిష్టమైన తిరుమల క్షేత్రంలో ఇటీవలికాలంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. టీటీడీ రూల్స్ ను పక్కనపెట్టి మరీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

తిరుమల కొండపై రీల్స్ చేస్తున్న వారిపై టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ యూట్యూబర్ తిరుమల ఘాట్ రోడ్డు, అలాగే కొండపై చేసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం ఈ పాడు పనికి పూనుకుంది. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ ఇలా అనేక చోట్ల రీల్స్ చిత్రీకరణ చేపట్టారు. అంతేకాక ఆ వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతూరాయల్. అలాగే ఆమె స్నేహితులు కూడా వీడియోను నెట్టింట పోస్టు చేశారు. అయితే ఈ వీడియోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై రీల్స్ చేయడం ఏంటని ఆగ్రహిస్తున్నారు.
తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం ఓవరాక్షన్
— BIG TV Breaking News (@bigtvtelugu) February 28, 2026
ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ వద్ద రీల్స్ చిత్రీకరణ
వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గీతూరాయల్, ఆమె స్నేహితులు
టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కుతున్న యూ ట్యూబర్లు
YouTube influencer Geethu Royal… pic.twitter.com/4QulSCCoir
ఇక గీతూ రాయల్ గురించి మనకు తెలిసిందే. యూట్యూబర్ గా పేరు పొందిన ఈమె జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ ద్వారా ఆడియన్స్ కి మరింత చేరువైంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6లో ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి రచ్చ చేసింది. అలా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత.. బిగ్ బాస్ తదుపరి సీజన్స్ కు రివ్యూస్ చెప్పి ఇంకా పాపులర్ అయింది. అయితే తాజాగా గీతూ రాయల్.. తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుమల కొండపై రీల్స్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో పై సోషల్ మీడియా లో నెటిజన్లు మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications