ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ
ప్రముఖ యువనటుడు రాహుల్ కన్నుమూశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయన వయస్సు 42 సంవత్సరాలే. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ హఠాత్ మరణవార్త చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తు చేపట్టారు.
రాహుల్ పూర్తి పేరు.. రాహుల్ అరుణోదయ బెనర్జీ. బెంగాలీ నటుడు. స్టార్ జల్సా టీవీలో ప్రసారమవుతున్న భోలే బాబా పర్ కరేగా అనే పాపులర్ సీరియల్‌లో లీడ్ క్యారెక్టర్ లో నటిస్తోన్నారు. ఈ సీరియల్ షూటింగ్ నిమిత్తం మొత్తం యూనిట్ పశ్చిమ బెంగాల్ లోని దీఘా సమీపంలోని తల్సారి బీచ్‌కు వెళ్ళింది. షూటింగ్ పూర్తయిన తర్వాత రాహుల్ తన సీరియల్ సహనటితో కలిసి సముద్ర తీరంలో నడుస్తూ, అలల ఆనందాన్ని ఆస్వాదించడానికి వెళ్ళారు.

అదే సమయంలో ఆయన అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న టెక్నీషియన్లు వెంటనే కాపాడేందుకు పరుగులు తీసి, సముద్రం లోపలి నుండి బయటకు తీసుకురాగలిగారు. అప్పటికీ ఆయన కొనఊపరితో ఉన్నారు. వెంటనే దగ్గర్లోని దీఘా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి అసలు కారణం నీటిలో మునిగిపోవడమా లేక ఆకస్మిక గుండెపోటా అనేది తెలియరాలేదు.
రాహుల్ బెనర్జీ ఆకస్మిక మరణం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనకు ఇష్టమైన నటులలో రాహుల్ బెనర్జీ ఒకడని, చాలా మంచి మనిషి అని పేర్కొన్నారు. మృదు స్వభావిగా బెంగాలీ చిత్ర, టీవీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
బుల్లితెరపై ప్రవేశించడానికి ముందు ఆయన అనేక నాటకాల్లో నటించారు. జీ బంగ్లాలో ప్రసారమైన ప్రసిద్ధ కార్యక్రమం 'ఖేల్'లో ఆదిత్య పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ విజయంతో ఆయనకు సినిమా అవకాశాలు లభించాయి. ఆయన పాడ్‌కాస్ట్ ప్రోగ్రాం సహజ్ కథ కూడా చాలా ప్రజాదరణ పొందింది. రాహుల్ అనేక చిత్రాలలో నటించడంతో పాటు, చాలా కాలం పాటు పలు సీరియల్స్‌లో లీడ్ క్యారెక్టర్లల్లో నటించారు.
2008లో చిరోదిని తుమి జే అమర్ బ్లాక్‌బస్టర్‌తో ఆయనకు స్టార్ డమ్ లభించింది. 2014లో తుమి ఆస్బే బోలే, 2016లో జుల్ఫికర్, 2018లో బ్యోమ్‌కేష్ గోత్రో, బిదాయ్ బ్యోమ్‌కేష్, 2025లో 'ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్' వంటివి ఉన్నాయి. టీవీలో హర్ గౌరీ పైసే హోటల్, మోహన్న వంటి సీరియల్స్‌లోనూ నటించారు. చిరోదిని తుమి జే ఆమార్ చిత్రంతో పరిచయమైన ప్రముఖ నటి ప్రియాంక సర్కార్‌ను పెళ్లాడారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications