• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాఫియా మహారాజులు

By Staff
|

గతంలోచెప్పినట్లుగానే జరుగుతున్నది.స్వర్ణాంధ్రప్రదేశ్‌ అంటూ ప్రచారంచేసుకుంటూ రుణాంధ్ర ప్రదేశ్‌లోకిజారిపోయి దీని చుట్టూ భయంకరమైనఅవినీతి, రాక్షష స్కాములు ఏర్పడుతుంటేక్షణక్షణం సామాన్యుడి చుట్టూబిగిస్తున్న సమస్యల వురితాళ్లప్రస్తావన వదిలేసి ఎన్నికల పిలుపులోతీవ్రవాదాన్ని కేంద్ర బిందువునుచేయడం వల్ల క్రమంగారక్తపాతాంధ్రప్రదేశ్‌గామారిపోతుందని హెచ్చరించడం జరిగింది.అదే యిప్పుడు జరుగుతోంది.కారకులెవరయినా,కారణాలేవైనా నేటి ఎన్నికల బ్యాలెట్‌పేపర్‌ రక్తం ఓడుతున్నది.భారతదేశంలోప్రజలకు వ్రణాల్లాంటి సమస్యలెన్నోవున్నయ్‌. అన్నింటికంటేముఖ్యమైనది ఎన్నికలు. ప్రతి పౌరుడికికనీసం తన అవసరాలకు,ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేప్రతినిధిని ఎన్నుకోవడం అతిక్లిష్టమైన సమస్య. ఎందుకంటే -ఇక్కడ ప్రజలు మతాలుగా, కులాలుగా,ప్రాంతాలుగా, పార్టీలుగా చీల్చబడ్డారు. ఈచీలికల పేలికల్లోంచి తన ప్రతినిధినిఎన్నుకోవలసి వుంటుంది. ఇందులోనిసమర్థ ప్రతినిధిని ఎలా గుర్తించాలి.రాజ్యాంగం ప్రకారం గానీ,ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గానీప్రజాప్రతినిధికో నిర్దిష్ట రూపం లేదు.నిర్వచించిన యోగ్యతలు లేవు.నిర్దేశిత నిబంధనలు లేవు. ఒకఅమూర్త వ్యక్తిని, ముసుగులో వున్నవ్యక్తిని తన ప్రతినిధిగా పౌరుగుఎన్నుకోవాలి. అందుకే, సహజంగానేవ్యక్తిత్వ రూపంలేని ఆ ప్రతినిధిఎన్నుకున్న పౌరుడికి కాక,తనను నిలబెట్టిన పార్టీకిప్రాతినిధ్యం వహిస్తాడు.భారతీయప్రజాస్వామ్య భావనలూ, ఎన్నికలు జరిగినతీరూ మొదటి నుండీ ఆచరణలోఆదర్శపూరితమైన,గౌరవప్రదమైన మార్గంలోనడవలేదు. అటు మేధావులనుఆకర్షించలేదు. ఇటు సామాన్యులకు ఆర్తితోపట్టలేదు. ఎందుకంటే ప్రజల పేర జరిగేయా మొత్తం రాజకీయ వ్యవహారంఏనాడూ ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులకుదగ్గరగా లేదు. ధనవంతులూ,పెట్టుబడిదారులూ, మాఫియా మహారాజులూలేదా వారి కనుసన్నలలో మెలిగేవారుమాత్రమే పాల్గొనగలిగినవి మనఎన్నికలు. అందువల్ల ఎన్నికలపైఏహ్యభావం పెరుగుతూ వస్తున్నదేతప్ప తగ్గడం లేదు. అయితేఏహ్యత ఏర్పడినంత మాత్రానవ్యక్తి హింసామార్గమే దానికిపరిష్కారం అనుకోవడం సరికాదు.పెరుగుతున్న సామాజికఅరాచకానికి, అన్యాయానికి ఒక వైపునపెద్దయెత్తున నిరసనతెలియజేస్తూ మరొకవైపుప్రత్యామ్నాయ వ్యవస్థా మార్పుల కోసంయోచించవలసి వుంటుంది. ప్రత్యామ్నాయ,సమాంతర వ్యవస్థల కోసంమేధావులు ఆలోచిస్తూనే వుండాలి. ఎన్నకలసమయంలో కాసేపు ఆలోచించి, తర్వాతికాలంలో దానిని పక్కన పెట్టడం సరికాదు. ఇదినిరంతర ప్రయత్నం.చర్చోపచర్చలు జరుగుతూనేవుండాలి.ఇటీవలపత్రిక ద్వారా పరిచయమైన ఒకప్రతిపాదనను పరిశీలనకుతీసుకుందాం. అది ఓటరుకుఅభ్యర్థులను తిరస్కరించే హక్కువుండాలనే భావన. నచ్చనిఅభ్యర్థులను తిరస్కరించే హక్కునుపోలింగు సందర్భంగా కల్పించాలని -" ఏ అభ్యర్థీ నచ్చలేదు అన్నఅంశాన్ని బ్యాలెట్‌ పేపర్‌లో చేర్చాలని తానుసిఫారసు చేసినట్లు ఎన్నికలప్రధానాధికారి యిటీవల చెప్పారు.ప్రభుత్వం దీనికి సమ్మతితెలుపలేదు. అయినప్పటికీ యాఅంశంపై ఏకీభావసాధనకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఎన్నికలప్రధానాధికారి కోరారు. ఈప్రతిపాదనపై కేంద్రన్యాయమంత్రిత్వ శాఖను ఒప్పించడానికిఎన్నికల సంఘం పందొమ్మిది వందలతొంబై ఎనిమిది నుంచీ ప్రయత్నిస్తున్నట్లుతెలుస్తున్నది. అలాగే, కనీసం యాభైశాతం ఓట్లు నమోదైన పక్షంలో యానిబంధన అమలు పరచాలని లా కమీషన్‌పందొమ్మిది వందల తొంబై తొమ్మిదిలోసిఫారసు చేసింది. అప్పటి ఉపరాష్ట్రపతికృష్ణకాంత్‌ గారు కూడా సదరుప్రతిపాదనను బలపరిచినట్లుతెలుస్తోంది.ఈప్రతిపాదనను అమలు చేస్తే -తమకు నచ్చని అభ్యర్థులనుతిరస్కరించడంతో పాటు తమనిరసనను తెలియజేసే అవకాశంకూడా ఓటర్లకు లభిస్తుందనిప్రతిపాదకులు భావిస్తున్నారు. అలాగే -మనదేశంలో ఓటు వేయడంతప్పనిసరి కాదు. ప్రస్తుత ఎన్నికలవిధానాన్ని బట్టి తమకు ఏ విధంగానూనచ్చని అభ్యర్థిని సైతం ఓటర్లు తమప్రతినిధిగా ఎన్నుకోవలసి వస్తున్నది.తమ ప్రతినిధిగా వుండడానికేతగడని భావిస్తున్న వ్యక్తికి ఓటుఎందుకు వెయ్యాలన్నది ప్రశ్న.ప్రతినిధులను వెనక్కిపిలిపించుకునే హక్కు భారత్‌ లాంటిదేశంలో ఆచరణ సాధ్యం కాదు.కాబట్టి దానికున్న " ఏ అభ్యర్థీనచ్చలేదు అని తెలియజెప్పే హక్కేమంచిదని, దీని వల్ల రాజకీయ పార్టీలుసచ్చరిత్ర, విశ్వసనీయత కలిగినఅభ్యర్థులనే ఎంపికచేసుకోకతప్పదనీ -ఏఅభ్యర్థీ నచ్చలేదంటూ తిరస్కరించేహక్కు లేకపోవడంతో రాజకీయపార్టీల దూకుడుకు ఓటర్లు ముకుతాడువేయలేకపోతున్నారు కాబట్టి - ఈహక్కు వున్నప్పుడే ప్రతి ఓటుకూ విలువవుందన్న వాస్తవంతెలిసివస్తుందని, అనాసక్తంగావున్న ఓటర్లలోనూ ఓటింగుపై విశ్వాసం,నమ్మకం కలుగుతాయని, అన్నిటికీమించి, రాజకీయ సామాజీకరణలోఎదురవుతున్న మూడుముఖ్యమైన సమస్యలైననిరాసక్తి, విలువల రాహిత్యం,ఒంటరితనాల పరిహారానికి యిదే సరైనమార్గం - అనీ యా విధాన ప్రతిపాదకులుభావిస్తున్నారు.ఇటువంటిప్రతిపాదనతో వారు ముందుకురావడం సంతోషించవలసినవిషయమే. వారు కూడా చాలా అనుభవంవున్నవారే. వారిని తప్పు పట్టడం లేదు.అయితే ఈ ప్రతిపాదన ప్రజలకుఆచరణలో ఏ విధంగావుపయోగపడుతుంది?"నాకునచ్చలేదు అనడం వల్ల - నచ్చినవ్యక్తిని ఎంచుకోవడానికి అవకాశంలభించినట్లు కాదు గదా, నచ్చిన వ్యక్తివచ్చే మార్గం ఏర్పడినట్లు కాదుగదా, నచ్చలేదు, నచ్చలేదు అనిఅనుకుంటూ వెళ్లడం వల్ల గానీ, తనుకావాలనుకున్న ప్రతినిధిలభ్యమైనట్లు కాదు.నచ్చలేదు,నచ్చలేదంటూ వెళ్లడం వల్లనిరసన, నిరాసక్తతకొనసాగుతుందే తప్పసమర్థత, యోగ్యత, నిజాయితీ గలప్రతినిధులను సమకూర్చే దానికి యిదిదోహదం చెయ్యదు.అంతేగాక,యిందులో మరొక ప్రమాదం కూడావుంది. వీరు - నచ్చని అభ్యర్థులనుతిరస్కరించమంటున్నారు. నక్సలైట్లు- యివి బూటకపు ఎన్నికలు కాబట్టి ఓటింగులోపాల్గొనవద్దంటున్నారు. ఇంకొంతమంది యిటువంటి ఎన్నికల్లో ఎవరుగెలిచినా ఒరిగేదేమీ లేదని ఓటింగుకుదూరంగా వుంటున్నారు. అంటే, ఎన్నికలప్రధానాధికారిగారు చేసేప్రతిపాదన, ఫలితంలో పైనతెలియజేసిన వారితోఏకీభవించినట్లే అవుతుంది అని. ఇది ఒకరకంగా చూస్తే నెగిటివ్‌ ఆలోచన.ఇందులో పాజిటివ్‌ ఆలోచన రావాలి. ఎన్నికలవిధానం గురించి ఆలోచించే ముందుప్రధానంగా మన ఆలోచన నిజాయితీగా,సమర్థత గల, యోగ్యత గల,స్వార్థరహిత, సేవాభావానికిఅంకితమైన, కులమతాలకుఅతీతంగా ఆలోచించగల అభ్యర్థులను ఎలాతయారు చెయ్యాలి అనే దానిపైకేంద్రీకరించబడాలి. ఎన్నికల విధానంలోనిమార్పుల విషయం దాని తర్వాతవస్తుంది.అలాగేదామాషా పద్ధతి, మిశ్రమ విధానంమొదలైన వాటిపై కూడా అప్పుడప్పుడుచర్చ జరుగుతూనే వుంది. అయితేఇవన్నీ కొన్ని పరిమితులతో, ప్రధానంగాఎన్నికల పరిధికి, పద్ధతికిఅనుబంధంగా జరుగుతున్నాయేతప్ప ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యంవహించే అభ్యర్థి నిజాయితీ, సమర్థత,యోగ్యత, మొదలైన వాటివైపువెళ్లడం లేదు. ఇంతకు ముందుచెప్పినట్లు సమర్థత, యోగ్యత,నిజాయితీ, నిబద్ధత గల అభ్యర్థులనుతయారు చేసుకున్నప్పుడుమాత్రమే యా రాజకీయ కార్యక్రమంమొత్తం ఒక సువ్యవస్థగారూపుదాల్చే అవకాశముంది. ఇంతకీగుర్తించవలసిందీగుర్తుచుకోవలసిందీ ఏమిటంటే -మన ఎన్నికల అద్దంలో మన ముఖమేకనబడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more