ఇరగదీసే హీరోలకూ ఐటమ్ సాంగ్స్

చిత్రం ఫెయిల్ అయినప్పటికీ ఆ చిత్రంలోని ఐటం పాటలు హిట్ అవుతుంటాయి. జగడం చిత్రంలో ముప్పయ్యారు ఇరవై నాలుగు ముప్పయ్యారు అనే పాట ఎంతగా హిట్ అయ్యిందో ఆ చిత్రం అంతగా ఫట్ అయ్యింది. అయితే ఐటం సాంగ్సు పెద్ద హీరోల చిత్రాలకు కూడా తప్పని పరిస్థితి అయింది. లేదంటే ప్రేక్షకులు చూడరేమో అనే భయం నిర్మాతల్లో పట్టుకున్నట్టుగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ ఆర్య చిత్రంలో అ అంటే అమలాపురం పాట పెద్ద హిట్. ఆ చిత్రం హిట్ కావడానికి ఆ పాట కూడా దోహద పడిందంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆర్య-2 మాత్రం ఫట్ అయింది. ఇక చిరు తనయుడు రామ్ చరణ్ తేజ సూపర్ డూపర్ హిట్ మగధీరలో కూడా ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ ఉంది. అయితే ఆరెంజ్ చిత్రం మాత్రం అందులో వెనుకబడి అట్టర్ ప్లాప్ అయింది. ఐటెం సాంగ్స్ ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోగలమని కేవలం చిన్న నిర్మాత దర్శకులు మాత్రమే కాదు, పెద్ద హీరోల నిర్మాత దర్శకులు కూడా అనుకుంటున్నారు. కాగా దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులలో ఎక్కువమంది ఐటం సాంగ్‌ల వైపు మొగ్గు చూపడం విశేషం.