• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాలీవుడ్‌లో మాఫియా భానుతోనే మొదలు కాదు!

By Srinivas
|

Bhanu Kiran
బాలీవుడ్‌లో మాఫియా హవా మనకు తెలిసిన విషయమే. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ తదితరులు షాడోగా ఉండి బాలీవుడ్‌ను ఏలారు. బాలీవుడ్ చిత్రాలలో మాఫియా హవా ఎంత అంటే చిత్రంలో ఎవరు నటించాలో కూడా వారే చెప్పేంతగా. మోనికాబేడి తదితరులకు మాఫియాతో లింక్స్ ఉన్నట్టు బయటపడింది కూడా. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాఫియా నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాడు. అయితే బాలీవుడ్‌లో మాఫియా హవా అందరూ సాధారణంగా విన్న విషయమే. అయితే మన టాలీవుడ్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ పలు తెలుగు చిత్రాలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే టాలీవుడ్‌లో మాఫియా మూలాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నప్పటికీ ముప్పయ్యేళ్ల క్రితమే చోటారాజన్ ఎప్పుడో టాలీవుడ్‌పై కన్నేశారు. తన అనుచరుడు అలీబాయ్‌ను టాలీవుడ్‌కు పంపి తన కార్యం నెరవేర్చుకునే ప్రయత్నాలు చేశాడు. టాలీవుడ్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అలీబాయ్ ప్రయత్నాలు చేశాడు. అయితే అలీబాయ్ పాతుకు పోతున్న దశలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. దీంతో టాలీవుడ్ కొద్దికాలం ప్రశాంతంగా ఉండిపోయింది.

ఆ తర్వాత అజీజ్ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. అజీజ్ రెడ్డి ఫిలింనగర్‌లోనే మకాం వేశాడు. నిర్మాతలు, హీరోలు తదితరుల నుండి దందా వసూలు చేయడం ప్రారంభించాడు. హీరోయిన్లతో కూడా అజీజ్ రెడ్డి మజా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. టాలీవుడ్‌ను అజీజ్ రెడ్డి చాలాకాలం ఏలాడు. హైదరాబాదులో ముఖ్యంగా టాలీవుడ్‌కు నిద్ర లేకుండా చేశాడు. అయితే ఓ సమయంలో టాస్కుఫోర్సు పోలీసులకు చిక్కిన అతడు ఎన్‌కౌంటర్లో మరణించడంతో టాలీవుడ్‌లో మాఫియాకు తెర పడినట్లయింది. అయితే అజీజ్ చనిపోయే సమయంలోనే భానుకిరణ్ టాలీవుడ్‌లో మాఫియా మూలాలు ఏర్పరుచుకున్నాడంట. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన డబ్బును చిత్ర పరిశ్రమలో పెట్టడం ద్వారా భారీగా ఆస్తులు కూడా బెట్టాడని సమాచారం. టాలీవుడ్‌లో పలు రౌడీగ్యాంగులు కూడా హల్ చల్ సృష్టించినప్పటికీ అవి ఎప్పటికప్పుడు కనుమరుగయ్యాయి. మద్దెలచెర్వు సూరికి ప్రధాన అనుచరుడు అయిన భానుకిరణ్ సూరి జైలుకు వెళ్లిన తర్వాత ఆయన పేరుతో వందల కోట్ల డబ్బులు వెనుకేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ తదితర డబ్బును తీసుకు వచ్చి భారీ బడ్జెట్ సినిమాల్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఖలేజా, పులి వంటి చిత్రాల్లో కూడా మాఫియా డబ్బు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న నిర్మాతలను లక్ష్యంగా చేసుకొని వారికి పెట్టుబడులు పెట్టి సొమ్ము చేసుకునే వాడు. ఈ నేపథ్యంలో సి.కళ్యాణ్, శింగనమల రమేష్ తదితర నిర్మాతల పేర్ల మీద భారీగా బినామీ ఆస్తులనూ కూడ బెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సి.కళ్యాణ్ పేరు మీద సుమార రూ.45 కోట్ల వరకు భాను బినామీ ఆస్తులు ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూరి జైలులో ఉన్న 2004 - 2009 మధ్య కాలంలో భాను భారీగా స్థిర, చరాస్తులు కూడా బెట్టినట్లుగా తెలుస్తోంది. బంజారాహిల్స్, రాయదుర్గం, కొండాపూర్ తదితర ముఖ్యమైన ప్రాంతాలలో రూ.500 కోట్ల మేర ఆస్తులు సంపాదించుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్తులపై సూరి నిలదీసినందుకే భాను ఆయనను చంపినట్లుగా కూడా భావిస్తున్నారు. భానుతో లింక్స్ ఉన్న నిర్మాతలు సైతం ఫైనాన్షియర్ల వద్ద నుండి డబ్బులు తీసుకొని తిరిగి వారికి చెల్లించకుండా భానుతో బెదిరింపులకు పాల్పడే వారనే ఆరోపణలు ఉన్నాయి. వైజయంతిరెడ్డి, ఆంజనేయులు గుప్తా తదితర ఫైనాన్షియర్లు వీరి బాధితులే. మరో విషయమేమంటే మాఫియా టాలీవుడ్‌లో ఎంటర్ కావడం వల్లనే నిర్మాణ ఖర్చులు అంతకంతకు పెరుగుతున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సూరి హత్య తర్వాత అజ్ణాతంలో ఉన్న భానుకు డబ్బులు ఎవరు అందజేస్తున్నారనే దిశలో పోలీసులు కూపీలాగుతున్నారని తెలుస్తోంది. ఏమైనా టాలీవుడ్‌ను మాఫియా ఎప్పుడు వీడుతుందో చూడాలి.

English summary
Mafia was not started with Bhanu Kiran in Tollywood. Mafia was entered before thirty years in tollywood. Ali Bhai and Aziz Reddy ruled tollywood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X