వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో గెలిస్తే మోడీ మరో సాహసేపేత నిర్ణయం, తెరపైకి బీటీటీ: ఏమిటిది?

ప్రధాని నరేంద్ర మోడీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మరో నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

No Income Tax : After GST PM Modi Come Up With New Plan | Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మరో నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత బీటీటీ అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్నారని అంటున్నారు.

నోట్ల రద్దుపై మన్మోహన్‌కు జైట్లీ దిమ్మతిరిగే కౌంటర్నోట్ల రద్దుపై మన్మోహన్‌కు జైట్లీ దిమ్మతిరిగే కౌంటర్

 అన్నీ రద్దు చేసి బీటీటీ

అన్నీ రద్దు చేసి బీటీటీ

ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని పన్నులను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే పన్నును అమలు చేసేందుకు మోడీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆదాయపన్ను సహా అన్నింటిని రద్దు చేసి వాటి స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్ను (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ -బీటీటీ) విధించాలని మోడీ యోచనగా చెబుతున్నారు.

 హానికర వస్తువులపై వినియోగ పన్ను

హానికర వస్తువులపై వినియోగ పన్ను

బీటీటీతో పాటు మద్యం, పొగాకు వంటి ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే వస్తువులపై వినియోగ పన్ను (కన్శంప్షన్ ట్యాక్స్) విధించాలని కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో పన్నుల వసూల కోసం ప్రభుత్వం ప్రజల వెంటపడుతోంది.

 పన్ను ఎగవేతకు నో ఛాన్స్, ఎవరికి ఎలా

పన్ను ఎగవేతకు నో ఛాన్స్, ఎవరికి ఎలా

బీటీటీ అమల్లోకి వస్తే అలా ఉండదు. అప్పుడు పన్ను ఎగవేతకు అవకాశముండదు. సంస్థలు, వ్యక్తులు ఎవరి మధ్యనైనా లావాదేవీలు జరగాలంటే రెండు శాతం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. ఇలా వచ్చిన ఆదాయంలో 0.7 శాతం కేంద్రానికి, 0.6 శాతం రాష్ట్రానికి, 0.35 శాతం స్థానిక సంస్థలకు, మరో 0.35 శాతం లావాదేవీ జరిగిన బ్యాంకుకు లభిస్తుంది.

 ఆయన సలహానే

ఆయన సలహానే

బీటీటీకి వాణిజ్య వర్గాల మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. నోట్ల రద్దు సలహా ఇచ్చిన అర్ధక్రాంతి ప్రతిష్టాన్ వ్యవస్థాపకులు అనిల్ బోకిల్ ఈ సూచన కూడా చేశారు.

 బోకిల్ పంచసూత్ర పథకం

బోకిల్ పంచసూత్ర పథకం

బోకిల్ పంచసూత్ర పథకం రూపొందించారు. ఒకటి దేశంలో పన్నులన్నీ ఎత్తేయడం, రెండు రూ.50 కు మించిన నోట్లను రద్దు చేయడం, మూడు నగదు లావాదేవీల మీద పరిమితి విధించడం, నాలుగు ఆన్‌లైన్ లావాదేవీలపై 2 శాతం బీటీటీ విధించడం, వాటిని డబ్బులు జమ అయ్యే ఖాతా నుంచి కట్ చేయడం, ఐదు బీటీటీలో కేంద్రానికి, రాష్ట్రానికి, స్థానిక సంస్థలకు వాటాలు పంచడం.

English summary
Arthakranti group wants the central government take another drastic step abolish income tax. According to Arthakranti, all taxes should be replaced by the Banking Transaction Tax (BTT), which could be applied at the rate of 2 per cent on all transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X