వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో చక్రం: పార్టీ బాధ్యతలు షర్మిలకు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాధ్యతలను.. ఆ పార్టీ అధ్యక్షులు వైయస్జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలకు ఇచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. జగన్ మొదటి నుండి సమైక్య గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉంది.

అయినప్పటికీ తెలంగాణలో తమ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలన్నా, సీమాంధ్రతో పాటు తెలంగాణలోను పార్టీ హవా కొనసాగాలన్నా తెలంగాణ ప్రాంతంలో పార్టీ బాధ్యతలు ముఖ్యమైన వారు ఎవరైనా తీసుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఉంటే ఆమెకే బాధ్యతలు అప్పగించే అవకాశముండేది. ఆమె ఎప్పుడో పార్టీని వీడారు.

ఇప్పుడు విభజన అనంతరం తెలంగాణలోను క్యాడర్‌‍ను కాపాడుకోవాల్సి ఉంది. దీంతో తెలంగాణలో బాధ్యతను షర్మిలకు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో తమ పార్టీ ప్రభావం ఇప్పుడు అంతగా లేకపోయినా భవిష్యత్తులో బాగుంటుందని భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో క్యాడర్ కోసం షర్మిలను రంగంలోకి దింపే అవకాశాలున్నాయంటున్నారు. జగన్ సీమాంధ్రను చూసుకొని, తెలంగాణలో సోదరికి బాధ్యతలు అప్పగిస్తారంటున్నారు. ఎన్నికల్లో షర్మిలనే తెలంగాణలో ప్రచారం చేసే అవకాశముంటుందంటున్నారు. అయితే, రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లో జగనే నాయకత్వం వహిస్తారని మరికొందరు అంటున్నారు.

English summary
The rumors are spreading that YSR Congress Party leader Sharmila may lead party in Telangana region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X