సిజెపై తిరుగుబాటు: చలమేశ్వర్‌తో రాజా భేటీ, మతలబు?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపిక్ మిశ్రాపై తిరుగుబాటు ప్రకటించిన జస్టిస్ చలమేశ్వర్‌తో సిపిఐ నేత రాజా సమావేశం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ భేటీపై ఊహాగానాలు చెలరేగడంతో రాజా వివరణ ఇచ్చారు.

సుప్రీం చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు: ఎవరీ చలమేశ్వర్?

  చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్..!

  చలమేశ్వర్ వద్దకు రాజా వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్లారని, పార్టీ ప్రతినిధిగా వెళ్లలేదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

   జోక్యం చేసుకోవడానికి కాదు...

  జోక్యం చేసుకోవడానికి కాదు...

  దీపక్ మిశ్రాపై నలుగురు సుప్రీంకోర్టు సీనయర్ న్యాయమూర్తులు తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవడానికి చలమేశ్వర్‌ను రాజా కలిశాడనే ఊహాగానాలను సురవరం సుధాకర్ రెడ్డి కొట్టిపారేశారు.

   అది సరికాదు....

  అది సరికాదు....

  వివాదంలో జోక్యం చేసుకోవాలని తమ పార్టీ అనుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సురవరం సుధాకర్ రెడ్డ అన్నారు. న్యాయవ్యవస్థనే ఆసమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. అది అత్యంత ప్రధానమైన అంశమని అన్నారు.మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయనిపుణులను సంప్రదించి, వారిని విశ్వాసంలోకి తీసుకుని వారి సలహాలను తీసుకోవాలని, సుప్రీంకోర్టు ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

   ప్రెస్ మీట్ కాగానే భేటీ..

  ప్రెస్ మీట్ కాగానే భేటీ..

  నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే సిపిఐ నాయకుడు రాజా చలమేశ్వర్‌ను కలిశారు. దాంతో వివాదం చెలరేగింది. విద్యార్థి దశ నుంచి తనకు చలమేశ్వర్ తెలుసునని, అందుకే కలిశానని రాజా అన్నారు.

   చలమేశ్వర్ ఇలా చెప్పారు..

  చలమేశ్వర్ ఇలా చెప్పారు..

  తాము ఏం చేయాలో అది చేశామని, ప్రభుత్వం ప్రజలే దానిపై స్పందించాల్సి ఉంటుందని జస్టిస్ చలమేశ్వర్ తనతో చెప్పినట్లు రాజా తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించినవారు చలమేశ్వర్ అనే విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CPI leeader Raja’s meeting with Justice Chelameswar, after a press meet convened by the four apex court judges, had led to a controversy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి