రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!
జీలకర్ర సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇందులో లెక్కలేనన్ని దివ్యౌషధాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. జీలకర్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో రోజూ ఉదయం జీలక్రర నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మరిగించి, వడపోసి గోరు వెచ్చగా తాగితే శరీరంలోని ప్రధాన భాగాల్లోని మలినాలు బయటకు పంపటంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
జీలకర్ర నీళ్లను సేవిస్తుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పరగడుపునే జీలకర్ర నీళ్లను తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీలకర్ర నీళ్లను సేవించడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. జీలకర్ర నీళ్లను తాగుతుంటే లివర్, కిడ్నీలు సైతం శుభ్రంగా ఉంటాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఐరన్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. అదే విధంగా ఈ నీటిని తీసుకోవటం ద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. శరీరం వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
జీలకర్రలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్ యంగా మొటిమలను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. జీలకర్ర నీళ్లను రోజూ తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. ఈ నీళ్లను తాగితే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అయితే, జీలకర్ర నీళ్లు బీపీని తగ్గించడంలో సహాయం చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఇక జీలకర్ర నీళ్లను మరీ అతిగా తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
-
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?













Click it and Unblock the Notifications