ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ కుర్మా.. అన్నమైనా, బిర్యానీ అయినా వదిలిపెట్టరు!
మనం తీసుకునే ఆహారంలో కూరల పాత్ర చాలా ఉంటుంది. మనం వండుకు తినే కూరల్లో ఉండే పోషకాలు మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఫంక్షన్ లలో గుత్తి వంకాయ కూర చాలా స్పెషల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కుర్మా ఫంక్షన్లలో ఏవిధంగా చేస్తారో తెలుసుకుందాం.
ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
గుత్తి వంకాయలు చిన్నవి- అరకిలో
నూనె- ఐదు టేబుల్ స్పూన్లు
వేరుశెనగలు- ఆఫ్ కప్పు
ఎండు కొబ్బరి తురుము- పావు కప్పు
నువ్వులు- రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- ఒక టీ స్పూను
ఎండు మిరపకాయలు- 2
లవంగాలు- రెండు
దాల్చిన చెక్క- చిన్న ముక్క
ఉప్పు- రెండు స్పూన్లు
కారం- రెండు స్పూన్లు రుచికి తగినంత
ఆవాలు- ఒక టీ స్పూన్
జీలకర్ర- ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు- సన్నగా తరిగినవి రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్
పసుపు- పావు స్పూన్
చింతపండు- నిమ్మకాయంత గుజ్జు తీసింది.

తయారీ విధానం
ముందుగా గుత్తి వంకాయలను కడిగి ముక్కలుగా కట్ చేయకుండా నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి. అలా కట్ చేసిన వంకాయలను ఉప్పు నీళ్లలో వేయాలి. లేదంటే వంకాయలు కండ్ర గా మారతాయి. కుర్మా మసాలా తయారు చేసుకోవడానికి ఒక పాన్ లో వేరుశనగలు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి పచ్చివాసన పోయేవరకు సిమ్లో వేయించుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే వంకాయ కుర్మా సూపర్ టేస్ట్
ఆపై కడాయిలో నూనె వేసి వంకాయలను తేలికగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించి ఆపై అందులో పసుపు, ఉప్పు, కారం పొడి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను బాగా ఉడికించాలి.
వీటిలోకి వంకాయ కుర్మా బాగుంటుంది
మసాలాలో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అందులో వంకాయలను వేసి చింతపండు రసం పోసి తగినంత కన్సిస్టెన్సీ చూసుకొని ఉడికించుకోవాలి. సిమ్ లో మూత పెట్టి మెల్లగా ఉడికించుకొని కుర్మా గ్రేవీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ గుత్తి వంకాయ కుర్మా పలావ్ లోను, వెజ్ బిర్యానీ లోను, వైట్ రైస్ లోను, పూరీలతో చాలా రుచిగా ఉంటుంది.
-
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications