వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: మరణానికి సంబంధించిన కలలు దేనికి సంకేతం; జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

|
Google Oneindia TeluguNews

మనిషి జీవితంపై కలల ప్రభావం ఉంటుందా? జ్యోతిష్య శాస్త్రం కలల గురించి ఏమి చెప్తుంది? ఎవరైనా మరణించినట్లు కలలు వస్తే అవి దేనికి సంకేతం? వంటి అనేక అంశాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. పురాతన కాలం నుండి, కలలు భవిష్యత్ సంఘటనలకు సంబంధించినవిగా కనిపిస్తాయి. రామాయణ కాలంలో కూడా, దశరథుడు మరణించే సమయంలో రాష్ట్రంలో ఏదో చెడు జరిగిందని రాముడు ఒక అరిష్ట కలగన్నాడు.

రావణుడు తన మరణానికి ముందు కలలో పలు అశుభ సంకేతాలను అందుకున్నాడు. చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మరణానికి సంబంధించిన కలలు.. వాటి ఫలితాలు

మరణానికి సంబంధించిన కలలు.. వాటి ఫలితాలు

ఇక మరణానికి సంబంధించి వచ్చే కలలు ఎప్పుడూ చెడుగా ఉండవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి మరణంపై వచ్చే కలలు కొన్ని సమయాల్లో శుభ సంకేతాలను కూడా ఇస్తాయని చెప్తున్నారు. మీకు కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం అని చెబుతారు. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని దీని అర్థం అని చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన మరణం గురించి కలలుగన్నట్లయితే, అతని ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం.

 కలలో చనిపోయినవారు వస్తే సంకేతం ఇదే

కలలో చనిపోయినవారు వస్తే సంకేతం ఇదే

ఒక వ్యక్తి కలలో ఎక్కడికైనా వెళుతున్నప్పుడు అతని మరణాన్ని చూస్తే, మీ చింతలు తొలగిపోతున్నాయని అర్థం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది . మీ కలలో ప్రియమైన వ్యక్తి మరణాన్ని మీరు చూసినట్లయితే, వారి జీవితం దీర్ఘకాలం ఉంటుందని అర్థం. మీరు ఒక కలలో చనిపోయిన వ్యక్తిని చూస్తే, అతని కోరికలు కొన్ని నెరవేరకుండా మిగిలిపోయాయని అర్థం, ఆ వ్యక్తి మీ ద్వారా తన కోరికలు నెరవేర్చాలనుకుంటున్నాడు అని అర్థం.

కలలో చనిపోయిన వ్యక్తితో మాట్లాడటం అంటే మీ కోరిక నెరవేరనుందని, మీరు వ్యాపారంలో లాభం పొందవచ్చని అర్థం. అదే సమయంలో, కలలలో చనిపోయిన కుటుంబాన్ని దహనం చేయడం చూస్తే మీ సమస్యలు త్వరలో ముగియబోతున్నాయని అర్థం.

మరణానికి సంబంధించిన అరిష్ట కలలు ఇవే

మరణానికి సంబంధించిన అరిష్ట కలలు ఇవే

ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కలలు కూడా కొన్ని ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కలలో ఆత్మహత్యను చూడటం అరిష్ట సంకేతమని తెలుస్తుంది. దీని అర్థం మీరు కొన్ని ఇబ్బందుల్లో పడబోతున్నారు లేదా మీకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు అని చెబుతున్నారు. కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. కలలో చంపబడిన వ్యక్తిని చూస్తే మీరు ప్రత్యేకంగా భావించే వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చని అర్థం. కలలో నరకబడిన తలని చూడటం, అంటే మర్డర్ చూడటం మంచిది కాదు, మీరు పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారని అర్థం.

కలలో గుండు చేయించుకోవటం, నూనె రాసుకోవటం వంటివి మరణ సంకేతాలు

కలలో గుండు చేయించుకోవటం, నూనె రాసుకోవటం వంటివి మరణ సంకేతాలు

అలాంటి కలలు మరణం వంటి బాధల సంకేతాలను సూచిస్తాయి. కలలో గుండు చేయించుకోవడం మంచిది కాదు. ఇది మరణ భయానికి సంకేతంగా కనిపిస్తుంది. కలలో నూనె రాసుకోవడం, గాడిదపై కూర్చున్నట్లు కనిపించడం భవిష్యత్తులో మృత్యువు వంటి బాధలకు సంకేతం. ఎప్పుడో ఒక్కసారి కాకుండా పదేపదే మరణం లేదా దహన సంస్కారాల కలలు కనడం కొన్ని సమయాలలో చాలా కష్టాలను సూచిస్తాయి.

English summary
Not all death dreams are bad. Some Dreams about certain deaths bring good luck. Astrology says that only certain dreams are ominous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X