తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!
పరాభవ నామ ఉగాది మార్చి 19వ తేదీన జరుపుకున్నాము. ఇక తెలుగు సంవత్సరాది కొత్త పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో తులారాశి జాతకులకు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం.
తులా రాశి వారి ఆదాయ వ్యయాలు
తులా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14 గా ఉంటుంది. రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంటుంది. ఉగాది నుంచి తులా రాశి జాతకులకు గురు గ్రహ ప్రభావంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేతువు కూడా అనుకూల స్థానంలో సంచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కుజుడు అష్టమ స్థానంలోను, రాహువు అర్ధాష్టమ స్థానంలోనూ ఉండడం వల్ల కూడా మీరు సానుకూల ఫలితాలను చూస్తారు.

ఆర్థిక స్థితి
ఈ సంవత్సరం తులా రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కేతువు సంచారం వీరికి విశేషమైన ప్రయోజనాలను ఇస్తుంది. శని లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికపరంగా ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఇక సంపదలకు కారకుడైన గురువు అదృష్ట స్థానంలో ఉండడం వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది. అయితే శని రాహువుల ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వ్యాపారులకు
ఈ సంవత్సరం వ్యాపారాలు చేసేవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు. వ్యాపారంలో ఊహించని నష్టాలను చూసే అవకాశం ఉంది. కేవలం రాహువు కారణంగానే నష్టాలు వస్తాయి. అయితే గురు, శని అనుగ్రహం వల్ల మీరు సానుకూల ఫలితాలను కూడా చూస్తారు. ఈ సమయంలో వ్యాపారులు తీసుకునే అనేక నిర్ణయాలు ప్రయోజనాలను అందిస్తాయి
విద్యార్థులకు
ఉగాది నుంచి తులా రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఏడాది ప్రారంభం నుంచి జూన్ రెండవ తేదీ వరకు 9వ స్థానంలో గురువు సంచారం కారణంగా విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్ 31తర్వాత గురువు విద్యకు సంబంధించి కొన్ని అంతరాయాలను కలిగించే అవకాశం ఉంది. ఇక రాహువు బలహీన స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీనిని అధిగమించడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.
కుటుంబ స్థితి
కొత్త ఏడాదిలో కుజుడి సంచారం కుటుంబ జీవితంలో కొన్ని చిన్నపాటి సమస్యలను సృష్టించవచ్చు. అయితే, గురు గ్రహం ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు, తిరిగి అక్టోబర్ 31 మధ్య కాలంలో కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరో స్థానంలో శని సంచారం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఆరోగ్యం
తులా రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. తులా రాశి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో ఆరోగ్యం బాగుంటుంది. రాహువు పంచమ స్థానం నుండి సంచారం చేయడం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గురు గ్రహం ఏడాది ప్రారంభం నుంచి జూన్ రెండవ తేదీ వరకు అనుకూల స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శనిదేవుడు అనుగ్రహంతో ఆరోగ్యం బాగుపడుతుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!!













Click it and Unblock the Notifications