తెలుగుదేశం ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రకు బ్రేక్, తోపులాట

గట్టమ్మ దేవాలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండను మహిళలు అడ్డుకున్న రాయినిగూడెం గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని అనుకున్నారు. గట్టమ్మ దేవాలయం వద్దనే విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అక్కడే బైఠాయించారు. ఆదివాసి మహిళ అయిన తనను అవమానిస్తున్నారని ఆమె విమర్శంచారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం వెల్లడించాలని, లేదంటే రాజీనామా చేయాలని, అప్పుడే సీతక్క పాదయాత్రను అనుమతిస్తామని తెలంగాణ జెఎసి నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications