ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సురేంద్రపై వనమా వర్గం దాడి, పరిస్థితి విషమం: చిరు పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vanama Venkateswara Rao
ఖమ్మం: మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత లక్కినేని సురేంద్రపైన కాంగ్రెసు నేత వనమా వెంకటేశ్వరరావు వర్గం నేత బుధవారం దాడి చేసింది. ఈ దాడిలో సురేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. మొదట కొత్తగూడెం ఆసుపత్రిలో చేర్పించినా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నది. కాగా సురేంద్ర ప్రజారాజ్యం పార్టీ నుండి ఇటీవలే కాంగ్రెసు‌లో చేరారు. చిరు విలీన ప్రకటనకు ముందే ఆయన కాంగ్రెసు‌లో చేరినట్టు సమాచారం. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వనమా వెంకటేశ్వరరావును పరామర్శించడానికి సురేంద్ర వచ్చారు.

పరామర్శించడానికి వచ్చిన సురేంద్రపై వనమా వర్గీయులు దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా బాదారు. దీంతో సురేంద్ర అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను కొందరు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సురేంద్రపై దాడి జరిగిన తర్వాత వనమా తన దీక్షను అర్ధాంతరంగా ముగించికొని వెళ్లిపోయారు. సురేంద్రపై చిలుకా రవి, ఆయన వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి నిరసనగా కొత్తగూడెం జెఏసి నగరం బంద్‌కు పిలుపునిచ్చింది.

కాగా సురేంద్రపై దాడికి నిరసనగా ఆయన వర్గం కొత్తగూడెం త్రీటౌన్ సెంటర్లో ధర్నాకు దిగింది. సురేంద్రపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన గ్రామం టేకులపల్లి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వారిని కొత్తగూడెం శివారులోనే అడ్డుకున్నారు. సురేంద్రపై దాడిని హోంమంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేస్తామని ఆయన వర్గం చెబుతోంది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా చిరంజీవి దాడిలో గాయపడ్డ సురేంద్ర కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.

English summary
Congress senior leader Vanama Venkateswara Rao followers attacked on Ex PRP leader Lakkineni Surendra today at Kothagudem. His condition is very serious. Chiranjeevi enquired about Surendra's condition with his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X