జీమెయిల్స్ హ్యాకింగ్: అమెరికా, చైనాకి మద్య సైబర్ యుద్దం మొదలైంది

ఈ విషయంపై సెక్యూరిటీ విశ్లేషకులు మాట్లాడుతూ హ్యాకర్స్ ఈ సైబర్ ఎటాక్‌కి పాల్పడడానికి కారణం ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్. దీనిపై అమెరికా అధికారులు తీవ్రంగా స్పందించడం జరిగింది. వైట్ హౌస్ ప్రతినిధి టొమ్మీ వైటర్ మాట్లాడుతూ మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తెప్పించడం జరిగింది. ఇందులో నిజానిజాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అఫీసియల్‌గా అమెరికాకి చెందినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ జీమెయిల్స్ హ్యాక్ చేయలేదని చెబుతున్నాను. దీనికి సంబంధించిన మిగతా వివరాలు యఫ్‌బిఐకి అందజేయడం జరుగుతుంది. మిగిలిన విషయం వారు చూసుకుంటారని అన్నారు.
కొత్తగా జరిగినటువంటి ఈ హ్యాకింగ్ వల్ల చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్‌కి, గూగుల్‌కి మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాలను దెబ్బతీసేవిధంగా ఉందని గూగుల్ ప్రస్తావించడం జరిగింది. చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్‌తో జరిగిన సెన్సార్‌షిప్ ప్రాబ్లమ్స్ వల్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ సర్వీస్‌ని అధికారంగా బయటకు పంపివేయడం జరిగింది. చైనాలో ఇలా జరగడం మొదటిసారి మాత్రం కాదు. మార్చి 2011లో గూగుల్ సర్వీస్‌ని చైనా బ్లాక్ చేయడం పట్ల గూగుల్ ఒకింత అసహానానికి లోను కావడం జరిగింది. ఐతే ఈ విషయంపై చైనా అవన్ని నిరాధారాలని కొట్టివేయడం జరిగింది.
వికీలీక్స్ చెప్పిన దాని ప్రకారం చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంటే కావాలని సెర్చ్ ఇంజన్ గూగుల్‌పై ఎటాక్ చేపిస్తుందని సమాచారం. కొత్తగా హ్యాకింగ్ ఎటాక్‌ని మొదలుపెట్టినటువంటి చైనా రాబోయే కాలంలో చైనాకి, పడమర దేశాలకి కూడా ' సైబర్ వార్'ని తెచ్చేవిధంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా పడమర దేశాల ప్రకారం చైనానే కావలని వీరితో ఎటాక్స్ చేయిస్తుందని, ఇటువంటి వాటికి చైనా ప్రభుత్వమే డబ్బుని సమకూరుస్తుందని అంచనా.