వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎలా వస్తుంది, జగనొస్తారు: కెసిఆర్‌కు సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
ఒంగోలు: మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏవిధంగా ఏర్పాటు అవుతుందో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందని తెరాస ఇప్పటి వరకు ముప్పై సార్లు చెప్పి ప్రజలను మోసగించిందన్నారు.

దీనిపై సెప్టెంబర్ 15 నుంచి ఉద్యమించనున్నట్లు చెప్పారు. పరకాల ఉపఎన్నికలో 44 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లలో ఒక్క ఓటు కూడా తెరాసకు పడలేదన్నారు. సిరిసిల్లలో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇటీవల చేపట్టిన దీక్షను ప్రజలు అడ్డుకోలేదని, కేవలం తెరాస కార్యకర్తలను ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టడం వల్లే అడ్డుకునే యత్నం చేశారన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం ద్వారా ప్రభుత్వం ప్రజల మనసుల్లో నుంచి ఆయనను తుడిచి వేసేందుకు కుయుక్తులు పన్నుతోందని సురేఖ విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనీ కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేసే పనిలో తలమునకలై ఉన్నాయనీ వ్యాఖ్యానించారు.

జగన్ నిర్దోషిగా త్వరలో బయటకొస్తారన్నారు. జగన్ అక్రమంగా కేసులలో ఇరికించి జైలుకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ వైయస్సార్ కాంగ్రెసు అన్ని స్థానాలలో విజయం సాధిస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.

English summary
YSR Congress party leader and former minister Konda Surekha questioned Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao about 'Telangana within three months'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X