వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రేప్‌లు తగ్గించాలంటే, గర్ల్స్‌కి 16 ఏళ్లకే పెళ్లి చేయాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

 To decrease incidents of rape, marry girls young: Khap panchyats
చండీగఢ్: సమాజంలో హెచ్చరిల్లుతున్న అత్యాచార ఘటనలను ఆపాలంటే బాల్య వివాహాలే అందుకు మంచి పరిష్కార మార్గమని హర్యానాలోని ఖాప్ పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. బాలికల వివాహ వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించాలని, అప్పుడు వారు లైంగిక అవసరాల కోసం అడ్డదారులు తొక్కనవసరం లేదని, భర్తే అందుబాటులో ఉంటాడని ఖాప్ పంచాయతీ పెద్దలు చెబుతున్నారు. బాల్య వివాహ వ్యవస్థను చట్టబద్దం చేయాలని వారు సూచిస్తున్నారు.

సినిమా, టీవీల ప్రభావంతోనే పిల్లలు ఇలా చెడు మార్గాలు పడుతున్నారని పేర్కొన్నాడు. జింద్ జిల్లాలో అత్యాచారానికి గురైందని భావిస్తున్న 16 ఏళ్ల ఓ దళిత బాలిక.. నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న నేపథ్యంలో ఖాప్ పెద్దలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గత 28 రోజుల్లో హర్యానాలో జరిగిన తొమ్మిది రేప్ కేసులు నమోదుకావడం, అందులో అత్యధికంగా జింద్ జిల్లాలోనే జరగడం గమనార్హం.

స్త్రీ, పురుష నిష్పత్తిలో పెరిగిపోతున్న అంతరం వల్లే హర్యానాలో అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం(ఐద్వా) అభిప్రాయపడింది. అమ్మాయిలు తక్కువగా ఉండడంతో అబ్బాయిలకు వివాహాలు కావడం లేదని అందువల్లే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఐద్వా వైస్‌ ప్రెసిడెంట్ జాగ్‌మతి సంగ్వాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 830మంది మాత్రమే మహిళలున్నారని వివరించారు.

బాలికలపట్ల వివక్షతో హర్యానాలో భ్రూణ హత్యలు కూడా పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలు జరిగిన సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా బాలికల తల్లిదండ్రులను మరింత అవమానపరిచేలా ఉంటోందని సంగ్వాన్ ఆరోపించారు. కాగా, హర్యానాలో మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపట్ల జాతీయ బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి ఒక్క కేసుకు విడివిడిగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

English summary
Amid outrage over a string of rape cases in Haryana, Khap panchyats in the state have come out with a bizarre suggestion that the marriageable age limit should be done away with claiming it will check such crimes while the ruling Congress saw a "conspiracy" in the incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X