ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు షాక్: ఎమ్మెల్యే వనిత రాజీనామా యోచన

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari District
ఏలూరు: పార్టీని అధికారంలోకి తేవడానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. పార్టీకి రాజీనామా చేయడానికి మరో ఎమ్మెల్యే సిద్ధపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శానససభ్యురాలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

తన నిర్ణయాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రకటిస్తానని వనిత చెప్పారు. ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు తెలుగుదేశం క్యాడర్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. గోపాలపురం నుంచి మొదటిసారి గత ఎన్నికల్లో వనిత శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు.

కొవ్వూరు మాజీ శానససభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పెండ్యాల వెంకటకృష్ణారావు పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నందువల్లనే వనిత కూడా ఆ బాటలో వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం. వనిత తండ్రి బాబాజీరావు పెండ్యాల వెంకటకృష్ణారావు ముఖ్య అనుచరుడు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని, తనపై కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని వనిత అన్నారు.

తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలిని కూడా తన వెంట వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకుని వెళ్తే ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కృష్ణారావు భావించినట్లు చెబుతున్నారు. చింతలపూడి శాసనసభ్యుడు రాజేష్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

English summary
It is said that Telugudesam party Gopalapuram MLA od West Godavari, Taneti Vanitha may resign from Telugudesam party. She may join YS Jagan's YSR Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X