వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనమూ వాటా తీసుకున్నట్లే: షర్మిలపై రేవంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
మహబూబ్‌నగర్ : వైయస్ నేతృత్వంలో 2004 ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యులు ఎవరు కూడా 2009 ఎన్నికల్లో గెలువలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి అన్నారు. వైయస్ నాయకత్వాన్ని జిల్లా ప్రజలు తిరస్కరించారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్న కుటుంబసభ్యుల యాత్రలకు మద్దతు ఇస్తే, వారి అక్రమ సంపాదనలో మనం కూడా వాటా తీసుకున్నట్లు అవుతుందని హెచ్చరించారు. అలాంటి వారి యాత్రలను బహిష్కరించాలని షర్మిలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల ప్రజలకు వైయస్ 40 వేల కోట్ల పనులు చేస్తే, ఆయన కుమారుడు జగన్ ఒక్కడికే లక్ష కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, తెలంగాణకు రాష్ట్ర మంత్రి డికె అరుణే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న 'మీ కోసం వస్తున్నా' పాదయాత్ర తెలంగాణలో అడుగుపెట్టగానే తెలంగాణవాదులు అడ్గుకునేందుకు ప్రయత్నించారని గుర్తు చేస్తూ షర్మిల చేస్తున్న పాదయాత్రలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

ఉద్యమం ముసుగులో అవినీతిపరులుగా మారిన కోదండరాం, నాగం జనార్దన్ రెడ్డి, పాలమూర్ జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డిలకు ఇప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉద్యమాల ముసుగుల్లో పెత్తందారుల సంఘానికి అధ్యక్షుడైన కేసీఆర్‌కు వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. డీకే అరుణ ఉద్యమాల పేరుతో గ్రూపులు జతచేసి ఢిల్లీ వీధుల్లో నాటకాలు ఆడుతూ, కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

మరోనేత నాగం జనార్దన్‌రెడ్డి భరోసా యాత్ర పేరుతో యాత్రలు నిర్వహిస్తున్నారని అంటూ ఆయన ఎవరికి భరోసా ఇస్తారో... అసలు ఆయనకు భరోసా ఉందా...? అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకున్న కేసీఆర్ కాంగ్రెస్‌ను ప్రశ్నించకుండా, టీడీపీని లక్ష్యంగా చేసుకోవడం, పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం మానుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్వార్థపూరిత రాజకీయాలను మానుకొని తెలంగాణ కోసం కృషి చేసిన వారికే పుట్టగతులుంటాయన్నారు.

English summary
Telugudesam MLA Revanth Reddy has called upon the people to boycott YSR Congress president YS Jagan's sister Sharmila's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X