ఒకరిద్దరూ రాజీనామాలు కాదు, అసెంబ్లీని రద్దు చేయండి, సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
సీపీఐ నారాయణ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతం వారు మాత్రమే నిరసనబాట పట్టారని గుర్తుచేశారు.
రైతుల పాదయాత్రపై మంత్రులు కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సివిల్ వార్ సృష్టించి అరాచకం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ మేనిఫెస్టోలో మూడు రాజధానులు అని ఎక్కడా అనలేదని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒకరిద్దరు రాజీనామా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కావాలంటే అసెంబ్లీని రద్దు చేయాలని సూచించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్దామని సీపీఐ నారాయణ సవాల్ విసిరారు. అప్పుడు జనం ఎవరికీ సపోర్ట్ చేస్తారో తెలియనుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కావాలని జనమే అడుగుతున్నారని గుర్తుచేశారు. ఇందులో మరో మాటకు తావులేదని చెప్పారు.
సీపీఐ నారాయణ బర్నింగ్ ఇష్యూపై స్పందిస్తుంటారు. అమరావతి రాజధాని గురించి రెగ్యులర్ గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూడు రాజధానుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడంతో నారాయణ స్పందించారు. అలా కాదని.. అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు.