ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. రేపే శంకుస్థాపన
కనుమ వేళ రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించే మరో భారీ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. రూ.13 వేల కోట్లతో కాకినాడకు వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర చరిత్రలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం గమనార్హం. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకినాడకు వెళ్తారు. 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
రూ.13 వేల కోట్ల పెట్టుబడులు...2,600 ఉద్యోగాలు
గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఏఎమ్ గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది... పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి.
పాత గ్రే అమోనియా ప్లాంట్‌ను..
ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్‌ను గ్రీన్ ప్లాంట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరినాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎగుమతులకు అద్భుత అవకాశం
ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్ట్‌కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రీన్ అమోనియాను అవసరమైన ప్రపంచ దేశాలకు ఎగుమతులకు అద్భుత అవకాశం ఉండనుంది. ఏఎమ్ గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 కేటీపీఏ గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది.
అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్‌కు చెందిన జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే రూ.2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కూడా ఏఎమ్ గ్రీన్ ఏర్పాటు చేస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications