తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారభద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతుందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలో ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు మరియు విశాఖపట్నంలలో ఆహార నాణ్యత పరీక్షల కోసం అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గుంటూరు, విశాఖపట్నంలలో ఆహార పరీక్షల ల్యాబ్ లు
ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార నాణ్యత పరీక్షల కోసం సదుపాయాల కొరత ఉండడంతో, ఆహార నమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వస్తుందని, అయితే ఇకపై తిరుమలలో ఏర్పాటు చేసిన నమూనా ఆధారంగా గుంటూరు, విశాఖపట్నంలలో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త ల్యాబ్ లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

త్వరలోనే విశాఖ, గుంటూరు ల్యాబ్స్ ఏర్పాటు
ఈ ల్యాబ్ లు ఎన్ ఎ బి ఎల్ ప్రమాణాలతో పనిచేసేలా ఏర్పాటు చేయబడతాయి అని ఆయన అన్నారు.విశాఖపట్నం, గుంటూరులో ల్యాబ్ లు త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ కేంద్రాలలో ఆహార నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించి కల్తీ ఆహారాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ఆహార భద్రతతో పాటు, ప్రజల ఆరోగ్య రక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు.
తిరుమల తరహాలోనే విశాఖ, గుంటూరు ల్యాబ్ లు
తిరుమలలో ఏర్పాటుచేసిన ల్యాబ్ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 24గంటలు పనిచేసే విధంగా రూపొందించారని దీంతో ముడిసరుకుల నాణ్యత తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ల్యాబ్ లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, ఇదే తరహాలో గుంటూరు, విశాఖపట్నం ల్యాబ్ లను సైతం అత్యాధునిక పరికరాలతో సిద్ధం చేస్తామన్నారు. ఈ ల్యాబ్ ల స్థాపనతో రాష్ట్రంలో కల్తీఆహారంపై నియంత్రణ పెరగడమే కాకుండా, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభం అవుతుందని స్పష్టం చేశారు.
నాణ్యతలో రాజీ పడేది లేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఈ ల్యాబ్ లు కీలక భూమిక పోషిస్తాయని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. మూడు నెలలలోనే విశాఖ మరియు గుంటూరులో ల్యాబ్ లు ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. నాణ్యతలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!













Click it and Unblock the Notifications