అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్షార్షియం ఔట్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్షార్షియాన్ని తప్పించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కన్షార్షియంతో ఒప్పందం రద్దుచేసుకున్నట్టు వెల్లడించారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి గత ప్రభుత్వం 30 వేల పైచిలుకు ఎకరాల భూమిని తీసుకుంది. సింగపూర్ కన్సార్షియంతో రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది. ప్రపంచస్థాయిలో రాజధాని నిర్మిస్తామని చెప్పి.. కాలం వెళ్లదీసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణంలో జరుగుతున్న జాప్యం.. సచివాలయంలోకి నీళ్లు రాకపై దృష్టిసారించింది. రాజధానిని మారుస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

ap govt key decision about capital city

ఇదిలాఉంటే సింగపూర్ కన్షార్సియంతో పరస్పర అంగీకార ఒప్పందాన్ని రద్దుచేస్తున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం 50 అంతస్తుల భవనం ఎందుకు అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ కూడా భవనాలు లేవని గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

ఒక్క పనికి కూడా పాలానపరమైన అనుమతి తీసుకోలేదని దుయ్యబట్టారు. అనుభవం లేనివారికి పనులు కట్టబెట్టారని విమర్శించారు. వారు చేసిన పనులే రాష్ట్రంపై ఆర్థికభారం పడుతుందని పేర్కొన్నారు. అంతేందుకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీలో పర్మినెంట్ అడ్రస్ కూడా లేదని దుయ్యబట్టారు.

English summary
ap govt key decision about capital city construction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X