వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకెళ్తున్న జనసేన.!సర్వేల్లో పవన్ పేరు ప్రస్తావిస్తున్న ఏపి ప్రజలు.!అనూహ్యంగా పుంజుకున్న పార్టీ.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఆలస్యం అమృతం విషం ఎప్పటికీ కాదని జనసేన పార్టీ ఏపీలో రుజువుచేస్తోంది. ఏపిలో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రెండు పార్టీలనే పరిగణలోకి తీసుకుంటూ వస్తున్నారు ఏపి ప్రజలు. తాజాగా జనసేన పార్టీ కూడా రాబోవు రోజుల్లో తన ప్రభావాన్ని చూపుతుందని, అధికార, ప్రతిపక్ష పార్టీలను జనసేన పార్టీ ఖంగుతినిపిస్తుందని తాజా సర్వేలు నిరూపిస్తున్నాయి. రాబోవు ఎన్నికలు, రాజకీయ పార్టీల మనుగడ, ప్రజాధరణ ఉన్న పార్టీల ప్రస్థావన అనే అంశాలు ప్రజల మద్యకు వచ్చినప్పుడు అనూహ్యంగా జనసేన పార్టీ పేరు చెప్పడం, ఏపి ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చర్చించడం మారుతున్న రాజకీయ ట్రెండ్ ను ప్రతిబింభింస్తోంది.

Recommended Video

Elections 2024 : సర్వేల్లో Pawan Kalyan పేరు ప్రస్తావిస్తున్న ప్రజలు..కారణం? | Oneindia Telugu
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..

ఏపిలో రాజకీయ ట్రెండ్ అనూహ్యంగా మారుతున్నట్టు తెలుస్తోంది. నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికి రెండు పార్టీలను వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి ఎగబాకింది జనసేన పార్టీ. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ను ఏపి ప్రజలు ఇంకా దూరం పెడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.

దేశంలో అత్యంత ప్రభావవంతంగా పరిణమించిన భారతీయ జనతా పార్టీ గురించి దేశం మొత్తం చర్చ జరుగుతున్నప్పటికి ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఎలాంటి చర్చ జరగడం లేదు. ఇదే అంశం కొన్ని ప్రయివేట్ సర్వే సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో రుజువైనట్టు స్పష్టంగా తెలుస్తోంది.

అధికార, ప్రతిపక్షానికి ధీటుగా జనసేన..

అధికార, ప్రతిపక్షానికి ధీటుగా జనసేన..

కొన్ని ప్రయివేట్ సర్వే సంస్థలు ఏపిలో నిర్వహించిన రాజకీయ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపి ని కాదని మూడో ప్రభావవంతమైన పార్టీగా జనసేనను ఏపి ప్రజలు గుర్తించినట్టు స్పష్టంగా ఆధారాలు లభిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ ఓ సర్వే సంస్థ అత్యుత్సాహంతో నిర్వహించిన సర్వేలో అనేక కొత్త అంశాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. యువత, విద్యార్ధులు, నిరుద్యోగులు, మహిళలు అనూహ్యంగా జనసేన పార్టీ పేరును, పవన్ కళ్యాణ్ పేరునూ ప్రస్థావించి సర్వే నిర్వహకులను విస్మయానికి గురి చేసినట్టు తెలుస్తోంది.

కలిసొచ్చిన ప్రజా కార్యక్రమాలు..

కలిసొచ్చిన ప్రజా కార్యక్రమాలు..

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న ప్రశ్నకు, కాబోయే సీఎం ఎవరైతే ఆమోదయోగ్యంగా ఉంటుందనే ప్రశ్నకు ఏపి ప్రజలు వినూత్న సమాధానం చెప్పినట్టు ఓ సర్వే వెల్లడించింది.

అధికార వైసిపి పార్ఠీకి ప్రజాధరణ తగ్గుతున్నట్టు ఆ సర్వే వివరించింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్ల కాస్త సానుకూల దృక్పదాన్ని ఏపి ప్రజలు వ్యక్తం చేసారు. ఇక జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, సీఎంగా పవన్ కళ్యాణ్ సరైన అభ్యర్ధి అని అధిక శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఆ సంస్థ తెలుపుతోంది.

పవన్ కళ్యాణ్ కు ఊహించని ప్రజాధరణ..

పవన్ కళ్యాణ్ కు ఊహించని ప్రజాధరణ..

2014లో ఓటమి తర్వాత జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం, పారిపోం, అని చేసిన ప్రకటన సానుకూల ఫలితాలనిస్తున్నట్టు తెలుస్తోంది. రెండున్నరేళ్లలో ప్రజల మద్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీని ఏపి ప్రజలు గుండెళ్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గతంలో చూపించిన ఆవేశానికి బదులు రాజకీయ పరిపక్వతకు ప్రజలు ఆకర్శితులు అవుతున్నట్టు తెలుస్తోంది.

దీనికి తోడు ప్రజా సమస్యలే లక్ష్యంగా జనసేన కార్యచరణ రూపొందించి, మరిన్ని కార్యక్రమాలకు రూకల్పన చేస్తే రాబోవు రోజుల్లో మరింత ప్రజాధరణ పొందే అవకాశం ఉంది. తెలుగుదేశం, వైసీపి పాలన చూసాం.. జనసేన పాలన ఎందుకు చూడకూడదని ఏపి ప్రజలు నిర్ణయించుకుంటే భీమ్లా నాయక్ చరిత్ర సృష్టించినట్టే ననే చర్చ జరుగుతోంది.

English summary
The forthcoming elections, the survival of political parties, the mention of popular parties and the naming of the Janasena party exceptionally when it comes to the people, the fact that the AP people are specifically discussing Pawan Kalyan reflect the changing political trend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X