వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై సస్పెన్షన్, 1980లోనే నల్లారి అమర్‌నాథ్‌రెడ్డికి చెక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి:1980లో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మెన్ ఎన్నికల్లో ఆనాడు యువ నేతగా , మంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ఉద్దండులైన వారికి ఎదురు నిలిచి తన పంతం నెగ్గించుకొన్నారు. అప్పటివరకు రాజకీయాల్లో ఎదురేలేదని భావించిన వారికి చంద్రబాబునాయుడు గుమ్మడి కుతుహలమ్మను జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా ఎన్నికయ్యేలా కీలకంగా వ్యవహరించారు.జిల్లా పరిషత్‌ చైర్మెన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారనే సాకుతో మంత్రిగా చంద్రబాబునాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ, 24 గంటల వ్యవధిలోనే ఈ సస్పెన్షన్ వేటు నుండి బాబు బయటపడ్డారు.

చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి ప్రవేశం, ఎమ్మెల్యే, మంత్రిగా ఎన్నికైన సందర్భాలను గురించి చంద్రబాబునాయుడు తన అనుభవాలను పంచుకొన్నారు.

పలు తెలుగు మీడియాఛానళ్ళకు చంద్రబాబునాయుడు తన సుధీర్ఘ రాజకీయ జీవితం గురించి వివరించారు. చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి దారితీసిన పరిస్థితులను కూడ ప్రస్తావించారు.

2019లో ఏమైనా జరగొచ్చు: బాబు సంచలనం, టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న దూరం 2019లో ఏమైనా జరగొచ్చు: బాబు సంచలనం, టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న దూరం

1980లో గుమ్మడి కుతుహలమ్మ జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నిక

1980లో గుమ్మడి కుతుహలమ్మ జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నిక

1980లో చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా గుమ్మడి కుతుహలమ్మను చంద్రబాబునాయుడు జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నికయ్యేలా చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నల్లారి అమర్‌నాధ్ రెడ్డి వర్గం బలంగా ఉండేది. అయితే జిల్లా పరిషత్ సభ్యులు ఎక్కువగా చంద్రబాబునాయుడు వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు.ఆనాడు చిత్తూరు జిల్లా నుండి దాస్, చంద్రబాబునాయుడు మంత్రులుగా ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మెన్ పదవి దళితులకు రిజర్వ్ అయింది.ఆ సమయంలో కుతుహలమ్మను తెరమీదికి తెచ్చి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నికయ్యేలా బాబు కీలకంగా వ్యవహరించారు.

నల్లారి అమర్‌నాధ్ రెడ్డికి చెక్ పెట్టిన బాబు

నల్లారి అమర్‌నాధ్ రెడ్డికి చెక్ పెట్టిన బాబు

1980లో చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో తమ గ్రూపు నుండి ఎక్కువ మంది జిల్లా పరిషత్ సభ్యులున్నప్పటికీ దళిత సామాజిక వర్గం నుండి విజయం సాధించినవారు లేరు.దీంతో అమర్‌నాధ్ రెడ్డి వర్గం తమకే జిల్లా పరిషత్ చైర్మెన్ పదవి దక్కుతోందని భావించింది. కానీ, చట్టాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన చంద్రబాబునాయుడు కో ఆప్షన్ సభ్యులు కూడ జిల్లా పరిషత్ చైర్మెన్ కావొచ్చనే నిబంధనను తనకు అనుకూలంగా మలుచుకొన్నాడు. తన స్నేహితుడు డాక్టర్ రమణ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే అప్పటికే వైద్యురాలిగా ఉన్న కుతుహలమ్మ పేరును డాక్టర్ రమణ సూచించారు. కుతుహలమ్మను పిలిపించి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్ గురించి ప్రస్తావించారు అయితే రాజకీయాల్లోకి రావడానికి ఆమె భయపడ్డారు. అయితే తొలుత కో ఆప్షన్ సభ్యురాలిగా, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మెన్‌గా చేస్తానని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా కుతుహలమ్మను జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నికయ్యేలా చక్రం తిప్పారు.

బాబుపై సస్పెన్షన్ వేటు

బాబుపై సస్పెన్షన్ వేటు


1980లో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మెన్‌ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానానికి విరుద్దంగా వ్యవహరించారని ఆనాడూ మంత్రులుగా ఉన్న చంద్రబాబు, సి.దాస్‌ తిరుగుబాటును నాటి పీసీసీ తీవ్రంగా పరిగణించింది. వారిద్దరినీ సస్పెండ్‌ చేసింది. మంత్రులుగా ఉన్న వారిని సస్పెండ్‌ చేసే హక్కు పీసీసీకి లేదంటూ చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో పోరాడారు. 24 గంటల్లోనే ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దీంతో... తొలినాళ్లలలోనే చంద్రబాబు చేసిన ఈ తిరుగుబాటు ఆయనను హీరోను చేసింది.

ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహం

ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహం

ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహంతో 1980 ఎన్నికల్లో తన వర్గానికే చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి దక్కేలా చంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. రాజకీయాలంటేనే తెలియని కుతుహలమ్మను కో ఆప్షన్ సభ్యురాలిగా చేసి ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మెన్ పదవి దక్కేలా చేశారు. ఎవరూ కూడ ఊహించని విధంగా ఆనాడూ బాబు వేసిన రాజకీయ వ్యూహం ఆయనను రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా చేసిందంటారు

English summary
Chandrababu naidu was played key role in the Chittoor district ZP chairman elections in 1980.Chandrababu naidu was played key role in the Chittoor district ZP chairman elections in 1980. Gummadi Kuthuhalamma was elected as ZP chairman in 1980.Chandrababu naidu and C. Das were played key role in this elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X