అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం మాట్లాడే రోజు త్వరలోనే ఉందన్న సీఎం చంద్రబాబు
త్వరలోనే అమరావతిలో అభివృద్ధి చేస్తున్న క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ఏపీ అభివృద్ధి చెందుతున్న తీరును ఆయన ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అన్న అంశం పైన జరిగిన సమావేశంలో చంద్రబాబు వివరించారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026'లో భాగంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అన్న అంశం పైన జరిగిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న తన లక్ష్యాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులను వివరించారు.

క్వాంటం వ్యాలీ గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా క్వాంటం వ్యాలీ గురించి ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో అభివృద్ధి చెందుతున్న దీని గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు వస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో విశాఖపట్నం ఏఐ డేటా హబ్ గా రూపుదిద్దుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
క్వాంటం ఎకో సిస్టమ్ అభివృద్ధిపై చంద్రబాబు
కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా, క్వాంటం కంప్యూటర్ కు అవసరమైన పరికరాలను కూడా తయారు చేసే స్థాయిలో, క్వాంటం ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు, భారతదేశం ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తుందని వెల్లడించారు.
డీప్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా సావరిన్ ఏఐ వినియోగానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు డీప్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు సాగుతుందని, రాష్ట్రంలో ఇప్పటికే స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడిటెక్ పార్కుల వంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఈ రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తూ, క్వాంటం ఎకో సిస్టమ్ ను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ దృష్టిని అంతర్జాతీయ వేదిక పైన సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను, టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతిని, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వేస్తున్న అడుగులను చంద్రబాబు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్ రంగాలలో ఏపీ దృష్టిని అంతర్జాతీయ వేదిక పైన సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !!












Click it and Unblock the Notifications