Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం!

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల పైన పడుతుంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ పైన, టూరిజం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

తీవ్ర ఖర్చు, ఒత్తిడిని ఎదుర్కొంటున్న హోటల్ పరిశ్రమ

ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ఇంధన ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర ఖర్చు , ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొంది. ఇంధన వ్యయాల పెరుగుదల, హోటల్ కార్యకలాపాలు పలు అంశాలపై నేరుగా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ముఖ్యంగా రవాణా, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు మరియు మొత్తం సేవల నిర్వహణ వ్యయాలు పెరిగాయని, దీనివల్ల స్టార్ హోటళ్లలో ఆపరేటింగ్ ఖర్చులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది.

Impact of iran israel war A Burden on Andhra Pradesh Star Hotel Industry Request to ap goverment

ఎల్పిజి సరఫరాలో ఇబ్బందితో కుదేలవుతున్న హోటల్ పరిశ్రమ

ప్రధానంగా ఎల్పీజీ (LPG) సరఫరా అస్థిరత మరియు ధరల పెరుగుదల తీవ్రమైన సమస్యగా మారిందని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. పలు హోటళ్లు సిలిండర్ రీఫిల్ ఆలస్యం మరియు సరఫరా లోపాలను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల వంటగది పనితీరు మరియు ఆహార తయారీ ప్రభావితమవుతోందని పేర్కొంది .

మెనూ ధరల భారాన్ని పూర్తిగా వినియోగదారుల పైన వేయలేక పోతున్న హోటల్స్

ఈ పరిస్థితుల్లో హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. కుకింగ్ ఆయిల్, రవాణా ఖర్చులు మరియు ఇతర అవసరమైన వస్తువుల ధరలు పెరగడం వల్ల మెనూ ధరలను 20-30% వరకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, వినియోగదారుల సంతృప్తి మరియు సేవా ప్రమాణాలను నిలబెట్టడానికి హోటళ్లు కొంతభాగాన్ని స్వయంగా భరించే ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించింది.

హోటల్స్ లాభాల పైన తీవ్ర ప్రభావం చూపుతున్న ఖర్చుల పెరుగుదల

నిరంతర ఖర్చు పెరుగుదల లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు హోటళ్లు పలు ఆపరేషనల్ చర్యలను చేపట్టాయి. వాటిలో వంటగది ప్రక్రియలను మెరుగుపరచడం, మెనూలను సరళీకరించడం, శక్తి వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. ఇవి ఖర్చులను నియంత్రించడమే కాకుండా సేవా నాణ్యతను కాపాడడానికీ సహాయపడుతున్నాయని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది.

పర్యాటక రంగం పైన కూడా యుద్ధ ప్రభావం

ఈ పరిస్థితి పర్యాటక రంగంపై కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతోందని తెలిపింది.దీర్ఘకాలికంగా ఈ పరిస్థితి కొనసాగితే ఉద్యోగ స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుత పరిశ్రమ పరిస్థితి తాత్కాలికంగా నిర్వహించగలిగిన స్థాయిలో ఉంది. డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, పరిశ్రమ ఆర్థిక ఒత్తిడిలో కొనసాగుతోంది. పరిస్థితి మరింత విషమిస్తే కార్యకలాపాలు మరియు వృద్ధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే

ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

హోటల్ పరిశ్రమకు ఎల్పీజీ సరఫరా నిరంతరంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ క్లిష్ట సమయంలో ఇన్‌పుట్ ఖర్చులను నియంత్రించేందుకు తగిన సహాయ చర్యలను చేపట్టాలని AP స్టార్ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది. సరైన సమయంలో చర్యలు పరిశ్రమ కార్యకలాపాలను కొనసాగించడంలో మరియు ఉద్యోగాలను రక్షించడంలో కీలకంగా ఉంటాయని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+