జగన్! ఇదీ నీ ఫ్యామిలీ: టిడిపి నేతల దూకుడు, పాదయాత్ర టైంలో అలా షాకిస్తారా?
పాదయాత్రకు ముందు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు విమర్శల దాడిని పెంచుతున్నారు.
Recommended Video

అమరావతి: పాదయాత్రకు ముందు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు విమర్శల దాడిని పెంచుతున్నారు.
మంత్రులు జవహర్, దేవినేని ఉమామహేశ్వర రావులతో పాటు టిడిపి సీనియర్ నేతలు ప్రతిపక్ష నేతపై విరుచుకుపడుతున్నారు. అసలు పాదయాత్ర ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నారని నిలదీస్తున్నారు.

జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు
నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. వైసిపి అంతా సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు జగన్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసారు.

ఇదీ నీ ఫ్యామిలీ
జగన్ ఫ్యామిలీనే చీటింగ్ చేసే ఫ్యామిలీ అని మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు. జగన్ తాత జనాల నుంచి డబ్బులు దోచుకున్నారని విమర్శించారు. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన అధికారాన్ని డబ్బు సంపాదించుకునేందుకు దుర్వినియోగం చేశారన్నారు. ఇక, జగన్ అన్నీ తప్పుడు పనులు చేసి వేల కోట్ల రూపాయలు వెనుకేశారని ఆరోపించారు.

కొత్తపల్లి గీత మొదలు
మరోవైపు, జగన్ పాదయాత్రను అధికార టిడిపి తక్కువ చేసేందుకు పావులు కదుపుతోందని వైసిపి నేతలు అనుమానిస్తున్నారు. పలువురు వైసిపి నేతలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపే మాపో ఎంపీ కొత్తపల్లి గీత టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

టచ్‌లో ఉన్న నేతలు ఆ టైంలో షాకిస్తారా
మరికొంతమంది వైసిపి ప్రజాప్రతినిధులు టిడిపితో టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లి గీత మొదలు.. జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యే వరకు, ఆయన పాదయాత్ర కొనసాగుతుంటే ఇప్పటికే తమతో టచ్‌లో ఉన్న నేతలను తమ పార్టీలో చేర్పించుకోవాలని టిడిపి ప్లాన్‌గా తెలుస్తోంది. తద్వారా జగన్ పాదయాత్రను తక్కువ చేయవచ్చునని భావిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications