AP Pensions: డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ ? సచివాలయ ఉద్యోగుల రిక్వెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతీ నెల ఒకటో తేదీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తోంది. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసిన ఈ పెన్షన్లను కూటమి సర్కార్ వచ్చాక మాత్రం సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. అయితే ప్రతీ నెల ఒకటో తేదీనే ఇస్తున్నా.. ఒక్కో సారి పరిస్ధితుల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూడా కొత్త ఏడాది 2026లో జనవరి పెన్షన్లు ఒకరోజు ముందే అందే అవకాశాలున్నాయి.
జనవరి ఒకటో తేదీ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా, ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పింఛన్ల పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మిగిలిన పింఛన్లను మాత్రం జనవరి 2వ తేదీ పంపిణీ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు ఈ మేరకు అవకాశం కలుగుతుందని వారు చెప్తున్నారు.

గతేడాది కూడా ఇలాగే కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న పెన్షన్ల పంపీణీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, ఈసారి కూడా ఆ సంప్రదాయన్ని కొనసాగించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్ డబ్ల్యూఎస్ కోరుతోంది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఇలా ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ నిబంధనల్లో మార్పులు చేసి వెసులుబాట్లు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications