వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలను ప్రమాదంలో పడేసిన టీజీ, నాకు అమెరికా రక్షణ కల్పిస్తుంది, ఇవాంకాకు తెలిస్తే: ఐలయ్య

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే టీజీ వెంకటేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, ఆయన రాజ్యసభ పదవిని రద్దు చేయాలని రచయిత కంచ ఐలయ్య శనివారం డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌లో విలేక

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే టీజీ వెంకటేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, ఆయన రాజ్యసభ పదవిని రద్దు చేయాలని రచయిత కంచ ఐలయ్య శనివారం డిమాండ్‌ చేశారు.

మీకు ఉన్నట్లే మాకూ ఉంది, అమెరికాకు మొరపెట్టుకుంటావా, కొట్టడమే వృథా: కంచ ఐలయ్యపై టిజిమీకు ఉన్నట్లే మాకూ ఉంది, అమెరికాకు మొరపెట్టుకుంటావా, కొట్టడమే వృథా: కంచ ఐలయ్యపై టిజి

హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో వాక్‌ స్వాతంత్య్రం ప్రమాదంలో పడిందని అమెరికా హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ సీనియర్‌ సభ్యుడు ట్రెంట్‌ ఫ్రాంక్స్ ఆందోళన వ్యక్తం చేశారన్నారు.

అమెరికా సంస్కృతిపై టిజి వ్యాఖ్యలు

అమెరికా సంస్కృతిపై టిజి వ్యాఖ్యలు

అమెరికా సభ్యుడి ఆందోళనపై స్పందించిన టీజీ వెంకటేష్ అమెరికా దేశ సంస్కృతిని సైతం హెచ్చరించారని కంచ ఐలయ్య అన్నారు. ఈ పరిణామాల వల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులకు ప్రమాదకర పరిస్థితులను కల్పించారని వ్యాఖ్యానించారు.

ఎన్నారైలను టిజి వెంకటేష్ ప్రమాదంలో పడేశారు

ఎన్నారైలను టిజి వెంకటేష్ ప్రమాదంలో పడేశారు

ఫత్వాలు జారీ చేస్తూ అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న టిజి వెంకటేష్‌ను చంద్రబాబు వెంటనే పార్టీ నుంచి, రాజ్యసభ సభ్యత్వం నుంచి తప్పించాలని కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. టిజి తన వ్యాఖ్యలతో అమెరికాతో పాటు యూరప్‌లోని ప్రవాస తెలుగువారు, భారతీయులను ప్రమాదంలో పడేశారన్నారు.

నన్ను అంత మాట అంటారా

నన్ను అంత మాట అంటారా

మానవ హక్కులకు గౌరవం ఇవ్వని దేశాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టదని, టీజీ వ్యాఖ్యలు చంద్రబాబు అమెరికా పర్యటన లక్ష్యాలకు నష్టం చేకూరుస్తుందని కంచ ఐలయ్య అన్నారు. రచయితనైన తనను వీధుల్లో ఊరితీయాలన్న టిజి ఫత్వా ఏపీలో మానవ హక్కుల ప్రతిష్టకు విఘాతం కలిగిస్తోందన్నారు. కానీ, టీజీ వెంకటేష్ నేరుగా ఉరితీయాలని చెప్పలేదు. చట్టం మార్చి ఐలయ్యను ఉరితీయాలన్నారు.

మోడీ, చంద్రబాబుల మౌనాన్ని ప్రపంచం చూస్తూ ఊరుకోదు

మోడీ, చంద్రబాబుల మౌనాన్ని ప్రపంచం చూస్తూ ఊరుకోదు

డబ్బున్న టీజీ లాంటి వారు ప్రజాస్వామ్యాన్ని అమ్మలేరని, కొనలేరన్నది పాలకులు గుర్తుంచుకోవాలని, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నా ప్రపంచం చూస్తూ ఊరుకోదని కంచ ఐలయ్య అన్నారు. ఎంపీ టీజీ తెలంగాణకు వచ్చి తనకు ఫత్వా జారీ చేసినా తెరాస ప్రభుత్వం స్పందించలేదన్నారు.

హైదరాబాదులో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం

హైదరాబాదులో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం

హైదరాబాదులో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని కంచ ఐలయ్య అన్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు రాబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌కు ఈ విషయం తెలిస్తే ప్రతికూలకూలంగా మారే అవకాశముందన్నారు.

అమెరికా ప్రభుత్వమే నాకు రక్షణ కల్పిస్తుంది

అమెరికా ప్రభుత్వమే నాకు రక్షణ కల్పిస్తుంది

ఇక్కడ తనకు ప్రాణహానీ ఉందని విజ్ఞప్తి చేస్తే పూర్తి ప్రభుత్వ ఖర్చులతో అమెరికా తనకు ఆశ్రయం కల్పిస్తుందని కంచ ఐలయ్య అన్నారు. తాను పుట్టిన మట్టిలోనే చనిపోయేవరకు జీవిస్తానని చెప్పారు. నారాయణ, శ్రీచైతన్య కార్పోరేట్ ఇంటర్మీడియేట్ కాలేజీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాముడు దేవుడే కాదు అని తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటిది కాదని, గతంలో మాట్లాడిందని చెప్పారు. కాగా, ఈ నెల 28న విజయవాడలో కంచ ఐలయ్యకు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయనను సన్మానించనున్నారు.

కంచ ఐలయ్య విజయవాడ పర్యటనపై హెచ్చరిక

కంచ ఐలయ్య విజయవాడ పర్యటనపై హెచ్చరిక


కంచ ఐలయ్య విజయవాడ పర్యటనపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కులాలు, సంఘాలు ఆయన పర్యటనను అడ్డుకుంటామని చెబుతున్నాయి. మరోవైపు, తాను విజయవాడలో పర్యటిస్తానని ఐలయ్య చెప్పారు.

English summary
The attack by TD Rajya Sabha member TG Venkatesh on American Senator H Trent Franks will put the NRI community, particularly from the two Telugu states, living in the US at risk Prof. Kancha Ilaiah said.The MP had asked whether Americans would keep quiet if their religion or ancestors were targeted. This was in reaction to a submission made in the Senate by Mr Franks on the attacks on Ilaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X