వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడేల Vs అంబటి కొనసాగున్న లొల్లి .! చిర్రెత్తిపోతున్న జనం..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : నలభై ఏళ్ల సుధీర్గ రాజకీయ జీవితం. 2019 ఎన్నికల్లో అత్యంత చేదు అనుభవాన్ని చవి చూసిన కోడెల శివప్రసాద్. ఒక్కసారి రేపల్లెల్లో గెలిచిన అంబటి రాంబాబు.. మరోసారి ఎమ్మెల్యే కావాలనే పోరాటంలో ఇద్దరి మద్య సంకుల సమరంగా మారింది. ఇది చాలదన్నట్టు తనకు రాజకీయంగా అన్యాయం జరిగిందని జనసేన పంచన చేరిన యర్రం వెంకటేశ్వరెడ్డి మరోవైపు. ఎట్టకేలకు ముక్కోణపు పోటీ. 2014లో చివరి నిమిషాన టికెట్ తెచ్చుకున్న కోడెలకు సత్తెనపల్లి బాగా కలిసోచ్చింది. స్పీకర్ పదవిలో బాగానే పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. పిల్లల పెత్తనంతో చెడ్డ పేరు కూడా అదేస్థాయిలో జేబులో వేసుకోవాల్సి వచ్చింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల్లో కోడెల వ్యవహారం, ఆ తర్వాత అంబటి రాంబాబు వ్యవమరిస్తున్న తీరు జనాలను అసహనానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.

 పోటా పోటీ ప్రెస్ మీట్లు..! విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న కోడెల, అంబటి..!!

పోటా పోటీ ప్రెస్ మీట్లు..! విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న కోడెల, అంబటి..!!

ఈ ఎన్నికల్లో కోడెల వద్దంటూ స్వతహాగా టీడీపీ లీడర్లు ధర్నాలు చేశారు. అయినా కోడెల శాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు సీటు తెచ్చుకున్నారు. ఈ దఫా అంబటికే అవకాశాలున్నాయంటూ సర్వేలు కూడా తేల్చాయి. కమ్మ, వైశ్య, కాపు, బీసీ, రెడ్డి వర్గాల ఓట్లు చాలా కీలకం. అటువంటి చోట కోడెల ఓటు బ్యాంకు కొంత యర్రం, మరికొంత అంబటి చీల్చుకుంటారనే చర్చ కూడా చోటుచేసుకుంది.

 గెలుపు నాదే... కాదు కాదు నాది..! అంబటి కోడెల విచిత్ర ప్రకటనలు..!!

గెలుపు నాదే... కాదు కాదు నాది..! అంబటి కోడెల విచిత్ర ప్రకటనలు..!!

దీన్ని ముందుగానే గమనించిన అంబటి కాపులను కలసి తనను గెలిపించమంటూ ప్రాధేయపడ్డారు. రెడ్లు ఎలాగూ వైసీపీ వైపు ఉంటారనే నమ్మకం ఉంది. కోడెలను వ్యతిరేకిస్తున్న వారిలో బీసీ, ఎస్సీ, వైశ్యులు కూడా ఉండటంతో అంబటి తన గెలుపు నల్లేరుపై నడక అనుకున్నారు. రాజుపాలెం మండలం వాస్తవంగానే వైసీపీ ఓటుబ్యాంకు గొడవ జరిగిన గ్రామం ఇనుమెట్లలో వైసీపీదే అగ్రభాగంగా ఉంటుంది.

 పోలింగ్ రోజు ఒక తంతు.. ఇప్పుడు మరో తంతు..! చిరాకు పడుతున్న జనాలు..!!

పోలింగ్ రోజు ఒక తంతు.. ఇప్పుడు మరో తంతు..! చిరాకు పడుతున్న జనాలు..!!

అటువంటి చోటికి కోడెల వెళ్లటం ముందస్తు పథకంలో భాగమే అంటున్నారు వైసీపీ నేతలు. కావాలని తమను రెచ్చగొట్టేందుకు వచ్చాడంటున్నారు. ఇది కాస్త గొడవగా మారటం.. కోడెలకు పరాభవం జరగటం జరిగాయి. దీనిపై వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. నాలుగు రోజుల తరువాత వైసీపీ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి కోడెలపై కేసు నమోదుచేశారు.

ఎవరు గెలిచినా అవినీతి అంటే తాట తీస్తామంటున్న స్థానికులు..! కోడెలకు మైనస్ అదే..!!

ఎవరు గెలిచినా అవినీతి అంటే తాట తీస్తామంటున్న స్థానికులు..! కోడెలకు మైనస్ అదే..!!

దీనిపై కోడెల, అంబటి మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పించుకుంటున్నారు. పైగా ఎవరికి వారు తమదే గెలుపు అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కోడెల మరో అడుగు ముందుకేసి అసలు నాకు అంబటి పోటీయే కాదంటూ మరింత ఆత్మవిశ్వాసంగా చెప్పటం అంబటి వర్గాన్ని రెచ్చగొట్టినట్టుగానే మారింది. ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో మున్ముందు ఇక్కడ ఇంకెంతటి గొడవలు జరుగుతాయనే ఆందోళన స్థానిక ప్రజానికం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Kodela and Ambati media conferences are very critical. And they are expressing their intention to win over themselves. Another step forward Kodela has expressed that Ambati Rambabu not competetor for him.Concerns that there are incidents of such conflicts in front of such tension situations are expressed by the local people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X