తప్పంతా ఆయనదే, కఠిన చర్యలకు కమిటీ సిఫారసు - తేల్చేసిన చంద్రబాబు ..!!
టీడీపీలో సంచలనంగా మారిన కొలికపూడి వివాదం లో కీలక మలుపు. కొలికపూడి వర్సస్ చిన్ని పంచాయితీ పైన విచారణ చేసిన క్రమశిక్షణా కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టులో తప్పు ఎవరిదో తేల్చేసింది. కఠిన చర్యలకు సిఫారసు చేసింది. సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సూచన చేసింది. ఈ నివేదిక పైన చంద్రబాబు స్పందించారు. తన నిర్ణయం ఏంటో వెల్లడించారు. ఇప్పుడు పార్టీలో ఈ వ్యవహారం ఉత్కంఠ పెంచుతోంది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్..ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మధ్య తలెత్తిన వివాదం పై పార్టీ క్రమశిక్షణా కమిటీ సీఎం చంద్రబాబు కు ఇచ్చిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావన చేసింది. ఈ వివాదంలో తప్పంతా కొలికపూడిదేనని తేల్చింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవా లని సిఫారసు చేసింది. కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారశైలి తొలి నుంచీ పార్టీ సిద్ధాంతాలకు భిన్నం గా ఉందని, తప్పటడుగు వేసిన ప్రతిసారీ క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ తీసుకుంటూనే ఉన్నా ఆయన తన శైలిని మార్చుకోలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి 16 నెలల కాలంలో మూడుసార్లు కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని, ప్రతిసారీ తప్పయిందని ఒప్పుకోవడం.. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడం ఆయనకు రివాజుగా మారిందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సారి కొలకపూడి ఏకంగా పార్టీ ఎంపీపైనే డబ్బు లు తీసుకుని టికెట్ ఇచ్చారని బహిరంగ ఆరోపణలు చేయడం క్షమార్హం కాదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తాను చేసిన ఆరోపణ లకు రుజువులు ఉన్నాయంటూ క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పిన కొలికపూడి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేద ని తెలిపారు. టీవీ చానళ్లలో వచ్చిన తన కార్యక్రమాలను పెన్ డ్రైవ్‌లో వేసి దాన్నే ఆధారంగా పరిగణించాలని కోరారని నివేదికలో పేర్కొన్నారు. కొలికపూడి తీరు బాధ్యతా రాహిత్యంగా ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం వారించినా.. 'నా నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని?.' అని క్రమశిక్షణ కమిటీ సభ్యుల ఎదుట కొలికపూడి తన వాదన వినిపించారని, ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా చూడాల ని కూడా కోరారని నివేదికలో పేర్కొన్నారు.
అయితే, ఈ వాదన సరికాదన్న కమిటీ.. ఎంపీగా తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గా ల్లో కేశినేని పర్యటించకుండా అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. తిరువూరు పర్ యటన సమయంలో చిన్ని ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు సమాచారం అందించి, ఆయన అనుమతితోనే పర్యటించారని పేర్కొంది. కమిటీతో ఈ నివేదిక పైన చర్చించిన సీఎం చంద్రబాబు పలు అంశాల పై ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్నిని పిలిచి మాట్లాడతానని చంద్ర బాబు కమిటీకి తెలిపారు. దీంతో.. ఇప్పుడు ఆ ఇద్దరితో మాట్లాడాలనే నిర్ణయంతో పాటుగా.. తీసుకునే చర్యల పై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications