• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ విషయంలో వైసీపీకి టీడీపీ మద్దతు.. అందరూ ముగినిపోవడం ఇష్టంలేకే..

|

ఏపీలో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన.. ఉనికి కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సత్తా నిరూపించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను చక్కటి అవకాశంగా భావించారు. మార్చి రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఆ మేరకు 59.85 శాతంతో రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. కానీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసింది. కోటా 50 శాతానికి మించరాదని, నెలరోజుల్లోగా బీసీ రిజర్వేషన్లనూ ఖరారు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో తప్పు వైసీపీదే అయినా.. సుప్రీంకోర్టులో పోరాటానికి మద్దతిచ్చేందుకు టీడీపీ ముందుకొచ్చింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

అన్ని పార్టీలూ సవాలుగా తీసుకున్న స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల సందిగ్ధతకు తెరదించుతూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుడదన్న కోర్టు.. అందులో బీసీ కోటా ఎంతుండాలనేదానిపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తీర్పు వెలువడటానికి ముందు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీ కోటా తగ్గిస్తే భగ్గుమంటాం..

బీసీ కోటా తగ్గిస్తే భగ్గుమంటాం..

‘‘రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బీసీలు 70 శాతం దాకా ఉన్నారు. 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో బీసీలకు 30 శాతం వాటానే దక్కింది. అయితే హైకోర్టు గనుక 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను కొట్టేసి.. కేవలం 50 శాతానికే పరిమితం కావాలని ఆదేశాలు ఇస్తేగనుక.. దాన్ని దాన్ని అడ్డంపెట్టుకుని బీసీల కోటా తగ్గించాలనుకుంటే మాత్రం టీడీపీ ఊరుకునే సమస్యేలేదు. వైసీపీ ప్రభుత్వం మిగతా కులాల్లో ఎవరి కోటాను కత్తిరిస్తుందో మాకు అనవసరం. బీసీల జోలికొస్తే మాత్రం సహించబోం''అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఆ విషయంలో సహకారం..

ఆ విషయంలో సహకారం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం కాకుండా.. కేవలం 50 శాతమే ఉండాలని హైకోర్టు తీర్పు ఇస్తే.. దాన్నివెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేయాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూచించారు. టీడీపీకి బీసీలే ప్రాణమని, బీసీలు కూడా టీడీపీనే విశ్వసిస్తారని, కాబట్టే బీసీ కోటా విషయంలో ఎంతవరకైనా ముందుకెళతామని, అందులో భాగంగానే జగన్ సర్కారుకు సూచన చేస్తున్నామని, ఎంత ఖర్చయినా సరే మంచి లాయర్ ను పెట్టి పోరాడాలని అచ్చెన్న అన్నారు. అయితే అసలీ పరిస్థితికి కారణమైన వ్యక్తి వైసీపీకి చెందినవాడేనంటూ మరో బాంబు పేల్చారాయన..

జగన్‌తో ఫొటోలే రుజువు..

జగన్‌తో ఫొటోలే రుజువు..


‘‘స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గింపునకు సంబంధించి టీడీపీ కుట్రలు చేస్తోందంటూ వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 59.85 కోటా జీవోను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి వైసీపీ సంబంధికుడే అనడానికి చాలా ఆధారాలున్నాయి. సీఎం జగన్ తో కలిసి ఆ వ్యక్తి దిగిన ఫొటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. తీర్పును అడ్డం పెట్టుకుని బీసీలకు కోటా కట్ చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన ఆటలు సాగనివ్వబోము''అని అచ్చెన్నాయుడు అన్నారు.

ఎన్నికల వాయిదాపై పార్టీల్లో గుబులు..

ఎన్నికల వాయిదాపై పార్టీల్లో గుబులు..

గడిచిన తొమ్మిది నెలల్లో వైసీపీ సర్కారుపై అలుపెరుగని పోరాటాలు చేస్తోన్న టీడీపీ.. స్థానిక ఎన్నికల్లో భారీ గెలుపు ద్వారా సత్తా చాటుకోవాలని డిసైడైంది. రాజధానుల తరలింపు, వ్యతిరేకులపై కేసులు, దాడులు, పథకాల్లో కోతలు తదితర అంశాల్లో సీఎం జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న టీడీపీ.. స్థానిక ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని శపథాలు కూడా చేసింది. ఈలోపే 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టేయడం.. బీసీ కోటాపై సర్కారుకు నెలరోజులు టైమివ్వడంతో ఎన్నికలు వాయిదాపడే పరిస్థితి నెలకొంది. అసలు ఎన్నికలే జరగకుండా అందరూ నష్టపోయేకంటే.. రిజర్వేషన్ల పంచాయితీ త్వరగా తేలేలా ప్రభుత్వానికి సహకరించడం ఉత్తమమనే అభిప్రాయం ప్రతిపక్షపార్టీ నేతల మాటల్లో వ్యక్తమైంది.

English summary
tdp leader acham naidu, yanamala ramakrishnudu warns ysrcp govt over bc reservations issue in local body elections. they said tdp wont accept reduction of bc reservations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X