Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో మీకోసం ఏఐ సేవక్

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ బాట్ ను మరో 15 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో వచ్చే సందేహాలకు 13భారతీయ భాషలలో తక్షణమే సమాధానాలు దీని ద్వారా ఇవ్వనుంది.

భక్తుల ఇబ్బందులతో టీటీడీ నిర్ణయం
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సమాచారం వారి స్థానిక భాషలోనే అందించేందుకు ప్రయత్నం చేస్తున్న టిటిడి త్వరలోనే ఏఐ చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. తరచుగా కాల్ సెంటర్లు బిజీగా ఉండడం, ఈ మెయిల్స్ కు సమాధానం జాప్యం జరగడం, మాతృభాషలో సమాచారం లేకపోవడం వంటి సమస్యలను భక్తులు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

TTD to Launch AI Chatbot in 13 Languages to Assist Tirumala Devotees

Take a Poll

మానవ వనరుల పరిమితులతో కొత్త చాట్ బాట్
శ్రీవారి భక్తుల అవసరార్థం మానవ వనరుల పరిమితులతో జాప్యం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను అధిగమించడానికి ఈ చాట్ బాట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుబంధంగా, 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. దర్శన టికెట్లు, వసతి, రవాణా, రిఫండ్ ల పైన భక్తుల ప్రశ్నలకు మానవ ప్రమేయం లేకుండా సమాధానాలు ఇస్తుంది.

వినియోగాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు
ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ వేదికగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. దీన్ని క్లౌడ్ సేవలు కోసం నెలకు సుమారు నాలుగు లక్షలు, సంవత్సరానికి పన్నులు మినహాయించి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వినియోగాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా కూడా చెల్లింపులు జరపాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

13 భారతీయ భాషల్లో సేవలందించేలా ఏఐ చాట్ బాట్
ఈ ఏఐ చాట్ బాట్ ఒకేసారి వేల సంఖ్యలో భక్తులతో సంభాషించేలా రూపొందిస్తున్నారు. 13 భారతీయ భాషల్లో ఇది సేవలందించేలా తయారు చేస్తున్నారు. దర్శన టికెట్ బుకింగ్ ప్రక్రియలో మార్గనిర్దేశం చేయడంతో పాటు, రియల్ టైం సమాచారం కూడా అందించేలా రూపొందిస్తున్నారు. టైప్ చేయడంతో పాటు స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+