విశాఖ ఉత్సవ్.. 9రోజుల్లో రూ.500 కోట్ల ఆదాయం టార్గెట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో సంపద సృష్టికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవాన్ని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించనుంది. జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు తొమ్మిదిరోజులపాటు పక్కా ప్రణాళికతో ఐదువందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో, 10లక్షల మంది సందర్శకులను ఆకర్షించేలా నిర్వహించనుంది. వైజాగ్, అనకాపల్లి, అరకులోయలో పక్కా ప్రణాళికతో కార్యక్రమాలను రూపొందించి వినోదాన్ని అందించనుంది.
సీ టు స్కై అనే వినూత్న కాన్సెప్ట్ తో విశాఖ ఉత్సవం
సీ టు స్కై అనే వినూత్న కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ ఉత్సవం విశాఖ తీరం నుండి అరకులోయ మేఘాల అంచు వరకు విస్తరించి, అనకాపల్లి సాంస్కృతిక వారసత్వాన్ని కలుపుతూ అందరికీ వినోదాన్ని ఉల్లాసాన్ని అందించనుంది. వైజాగ్, అరకు, అనకాపల్లి ప్రాంతాలను దేశంలోనే మొదటి సమీకృత గ్లోబల్ కోస్టల్ హిల్ గ్రోత్ కారిడార్ గా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన లక్ష్యంగా తెలుస్తోంది.

20కి పైగా ప్రదేశాలలో, 500కు పైగా ప్రత్యేక ఈవెంట్ లు
మొత్తం 20కి పైగా ప్రదేశాలలో, 500కు పైగా ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ప్రజలను ఆకర్షించనుంది. విశాఖ ఉత్సవం. 650 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శకులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. 26 కిలోమీటర్ల సుందరమైన బీచ్ రోడ్డు ప్రధాన వేదికగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలకు ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
3000 మందికి ప్రత్యక్షంగాను, 1800 మందికి పరోక్షంగాను ఉపాధి
ఈ ఉత్సవాల ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగాను, 1800 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు దాదాపు 500కోట్ల రూపాయల ఊతం లభిస్తుంది. ఈ ఉత్సవాలకు, భద్రత, టెక్నాలజీ, సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రపంచ పటంలోని అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టేలా ప్లాన్ చేశారు. ఈ ఉత్సవాలలో ముఖ్య ఆకర్షణలుగా అనేక కార్యక్రమాలు ఉండనున్నాయి.
వేదికల వారీగా విశాఖ ఉత్సవం
వేదికల వారీగా చూసినట్లయితే విశాఖపట్నంలో జనవరి 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆర్కే బీచ్ లో ప్రతి సాయంత్రం డ్రోన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఋషికొండ వద్ద స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్ వంటి సాహసక్రీడలు అందుబాటులో ఉంటాయి. పోర్ట్ స్టేడియం, సాగర్ నగర్ వంటి ప్రాంతాలు వినోదానికి ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. అనకాపల్లిలో జనవరి 29, 30తేదీలలో విశాఖ ఉత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు.
అనకాపల్లి, అరకు లో ఉత్సవాలు ఇలా
ఆధ్యాత్మికతకు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ బొజ్జన్నకొండ వద్ద ధ్యాన శిబిరాలు, కొండకర్ల ఆవ వద్ద ఎకో టూరిజం వర్క్ షాప్‌లు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో రామ్ మిరియాల, గాయని సునీత లైవ్ కన్సర్ట్ లు నిర్వహిస్తారు. ఇక జనవరి 30నుండి ఫిబ్రవరి 1తేదీలలో గిరిజన వారసత్వాన్ని చాటి చెప్పేలా అరకులోయలో ఉత్సవాలు నిర్వహిస్తారు. కాఫీ ఫెస్టివల్, నేచర్ వాక్స్, సాహస యాత్రలతో అరకు పర్యాటకులకు సరికొత్త అందాలను పరిచయం చేస్తారు.
తొమ్మిది రోజుల్లో 500 కోట్ల ఆదాయం
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్ కందుల దుర్గేష్,వంగలపూడి అనిత వంటి నాయకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తొమ్మిది రోజుల్లో 500 కోట్ల ఆదాయాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు











Click it and Unblock the Notifications