'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు' సమగ్ర భూ రీసర్వే .. ఏపీలో జనవరి నుండి ప్రారంభం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుని వివిధ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు రంగం సిద్ధమైంది . జనవరి ఒకటవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సమగ్ర భూముల రీ సర్వేకు వైయస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు అనే పేరు పెట్టారు . ఇక దీనికి సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

2021 జనవరి నుండి ప్రారంభించి 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చెయ్యాలనే లక్ష్యం
2021 జనవరి నుండి ప్రారంభించి 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది .
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములను రీ సర్వే చేయడం కోసం 4,500 సర్వే టీమ్ లను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సమగ్ర భూ సర్వే కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు, గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ కోర్టులు .. 15 వేల మంది సర్వే సిబ్బంది
దాదాపు 120 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ భూ సర్వే చేయబోతున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
డ్రోన్ లు, రోవర్లు 70 బేస్ స్టేషన్ల ద్వారా నిర్వహించనున్న ఈ సర్వేలో మొత్తం పదిహేను వేల మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఒక్కో మండలంలో సర్వే నిర్వహణకు నాలుగు నెలలు పట్టనుంది. సర్వే సమయంలో వచ్చే భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వే చేసిన ప్రతి భూమికి యూనిట్ నెంబర్ ఇవ్వడంతో ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా నమోదయి ఉంటాయి. ఎలాంటి భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది.

భూసర్వే కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ .. ఆమోదించిన ఆర్ధిక శాఖ
ఈ సర్వే కోసం 987.46 కోట్ల రూపాయల ఈ మేరకు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. సర్వేలో వినియోగించే డ్రోన్ల కోసం 81 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జగనన్న భూ రక్షణ పేరుతో డిజిటల్ బౌండరీ మార్కర్, ఫిజికల్ బౌండరీ మార్కర్ లను ఏర్పాటు చేయనున్నారు. హద్దు రాళ్ళ ఏర్పాటు కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి శిక్షణ కోసం 21. 21 కోట్లు, లాజిస్టిక్స్ కోసం 2.59 కోట్ల రూపాయలు, రికరింగ్ పధకం కింద 182.04 కోట్లు ఖర్చవుతుందని సర్వే శాఖ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలిపింది.

జగన్ ప్రజా సంకల్ప యాత్ర హామీ నెరవేర్చేందుకు సర్వం సిద్ధం
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలోనే రీ సర్వే చేయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్ విభాగాల అధికారులు సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఏపీలో భూముల సమగ్ర రీసర్వే నిర్వహించనున్నారు .
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications