మోడీ, కేసీఆర్ అబద్దాలను వల్లెవేస్తున్నారు: భట్టి విక్రమార్క
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క్ మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేయనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ మోసం చేశారని ఆరోపించారు.

రాహుల్ గాంధీ సభకు నల్గొండ నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు యాసంగి సీజన్ లో సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు ఎలాంటి పంట పండించలేదని ఉత్తమ్ అన్నారు. రైతులు రెండో పంట వేయకుండా ఆదాయాన్ని కోల్పోయారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆలస్యంగా వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతో ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని.. ఏ ఒక్కరితోనో ఇది జరగదు. అందరూ కలసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
వరంగల్ లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో భరోసా నింపేందుకే రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు, పలు పరికరాలను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రుణ భారం రూ.లక్ష దాటి రూ.4 లక్షలకు చేరిందన్నారు. అయినప్పటికీ ఇంకా క్లియర్ కాలేదని చెప్పారు.