హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిటైరైన వారిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు.. వాస్తవాలు తెలుస్తాయనా..? రఘునందన్ రావు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. వడ్ల కొనుగోలు అయితేనేం.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అయితేనే.. ఏదైనా.. నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతుండగా.. మరోవైపు రఘనందన్ రావు కేటీఆర్‌పై కౌంటర్ అాటాక్ చేస్తున్నారు. 24 గంటలు ఉచిత కరెంట్ ముచ్చటే లేదని విమర్శిస్తూ.. కేటీఆర్‌కు తొందర ఎక్కువైందన్నారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయనే ఆందోళన కేటీఆర్‌లో కన్పిస్తుందని కామెంట్ చేశారు.

 అంతా కేసీఆరే చేశారు..

అంతా కేసీఆరే చేశారు..

సీఎం‌ కేసీఆర్ సంతకం చేయడం వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 290 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్‌కు తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో రిటైర్‌ అయి‌న అధికారులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రమే 24 గంటల కరెంట్ ఉందని ఎద్దేవా చేశారు.

ప్రభాకరరావు, ఎర్రబెల్లి ఊరిలో కూడా

ప్రభాకరరావు, ఎర్రబెల్లి ఊరిలో కూడా


తమ ఊరితో సహా.. ప్రభాకరరావు, మంత్రి ఎర్రబెల్లి ఊళ్లలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. మోటార్లుకు మీటర్లు పెడతారనే మంత్రి హరీష్ రావు ఇప్పుడేమి చెప్తారు? అని అడిగారు. రైతుల డిమాండ్ మేరకు రాత్రిపూట కూడా కరెంటు ఇవ్వాలని కోరారు. నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందం ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు.

Recommended Video

Raghunandan Rao : ఎన్వీ రమణకు లేఖ పై BJP MLA కీలక'వ్యాఖ్యలు | Oneindia Telugu
 జాప్యం ఇందుకే..?

జాప్యం ఇందుకే..?


సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల కృష్ణా నదీజాలాల పంపకాల్లో జాప్యం జరుగుతుందని చెప్పారు. ఎండుతోన్న పంటతో తెలంగాణ రైతులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఉచిత కరెంట్‌పై ఫీల్డ్ లెవల్‌లో మరొలా ఉన్నాయని తెలిపారు. ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని ఆయన కోరారు. మంత్రి కేటీఆర్‌కు రఘునందన్ రావు కౌంటర్ అటాక్ చేశారు. మరీ దీనిపై టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు స్పందిస్తారో చూడాలీ మరీ.

English summary
why government continue retired employees bjp mla raghunandan rao questioned to minister ktr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X