కాంగ్రెస్, ఎన్సీపీకి మజ్లిస్ పోటు- జోరుగా ఎగిరిన గాలి పటం
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఊహించని విజయం సాధించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల నాటికి రాష్ట్రవ్యాప్తంగా 75 స్థానాల్లో ముందంజలో కనిపించింది. ముస్లిం, దళిత ఓటర్లలో తన ప్రభావాన్ని పెంచుకుంది. ఓటుబ్యాంకును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న చోట్ల జెండా పాతింది.
అహిల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తన ఉనికిని చాటుకుంది. ఈ రెండు చోట్లా తన ఖాతా తెరిచింది ఎంఐఎం. ఈ రెండు మున్సిపాలిటీల్లో మజ్లిస్ గెలవడం అనేది ఇంతకుముందెప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి. అహిల్యానగర్లో 3, చంద్రపూర్‌లో ఒక వార్డులో విజయాన్ని అందుకుంది. మహారాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్)కు చెందిన సంప్రదాయ ఓటుబ్యాంకును భారీగా చీల్చిందనే అంచనాలు ఉన్నాయి.

ముంబైలోనూ ఏఐఎంఐఎం తన పట్టును మరింత పెంచుకుంది. దేశంలోనే అత్యంత ధనిక సివిక్ బాడీ.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 2017లో ఈ పార్టీకి రెండు స్థానాలే ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు అయింది. దీంతో ఏఐఎంఐఎం గ్రూప్ లీడర్‌గా బీఎంసీలో కార్యాలయ కేటాయింపునకు అర్హత సాధిస్తుందని ఫ్రీ ప్రెస్ జర్నల్ వెల్లడించింది.
ముంబై వార్డు నంబర్ 134లో ఏఐఎంఐఎం అభ్యర్థి మెహజబీన్ అతీక్ అహ్మద్ 8,414 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బెంజీర్ దివాతేను 2,216 ఓట్ల తేడాతో ఓడించారు. అలాగే- వార్డు నంబర్ 136లో మజ్లిస్ అభ్యర్థి జమీర్ ఖురేషి.. తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అభ్యర్థిపై 9,957 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. వార్డు నంబర్ 137లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన పటేల్ షమీర్ 4,370 ఓట్లు, వార్డు నంబర్ 145లో ఖైరునిసా అక్బర్ హుస్సేన్- 2,095 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ పలు స్థానాల్లో ఏఐఎంఐఎం ఆధిక్యత చూపింది. మలేగావ్‌లో 20, నాందేడ్‌లో 14, అమరావతిలో ఆరు స్థానాలు గెలుచుకుంది. పర్బాణిలో కాంగ్రెస్ విజేతలు అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో చేతులు కలుపుతారని అసదుద్దీన్ ఒవైసీ తన ప్రచార సభల్లో ఆరోపించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ మజ్లిస్ చేతిలో ఓడిపోయారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications