• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇండియన్ ఐడల్‌లో షూ పాలిష్ చేసుకునే వ్యక్తి ...ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ట్వీట్

|

ముంబై: ఇండియన్ ఐడల్.. భారత టెలివిజన్ రంగంలో ఓ ఊపు ఊపేస్తున్న రియాల్టీ సింగింగ్ కాంపిటీషన్. ఒక పోటీదారుడు ఇండియన్ ఐడల్ వేదికపై తన గొంతును వినిపించాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించి రావాల్సి ఉంటుంది. అలాంటి మెగా షోలో బాతిందాకు చెందిన ఒక సామాన్య యువకుడు తన గొంతుతో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ యువకుడి నేపథ్యం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు.

 మెస్మరైజ్ చేసిన సన్నీ పాట

మెస్మరైజ్ చేసిన సన్నీ పాట

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న యువగాయకుడి పేరు సన్నీ. బాతిందా ప్రాంతం నుంచి ఇండియన్ ఐడల్‌కు ఎంపికయ్యాడు. తన గాత్రంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన పాటతో మహామహుల ప్రశంసలు అందుకున్నాడు. సన్నీ పాటకోసమే టీవీ ముందు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే ఈ యువగాయకుడికి క్రేజ్ ఎంతుందో అర్థమవుతుంది. ఇదంతా ఇండియన్ ఐడల్ వేదికగా జరుగుతోంది. ఇంతకీ సన్నీ నేపథ్యం ఏమిటనేగా మీ అందరి డౌటు.. అక్కడికే వస్తున్నాం.

 ఇళ్లు గడవడం కోసం షూ పాలిష్ చేసిన సన్నీ

ఇళ్లు గడవడం కోసం షూ పాలిష్ చేసిన సన్నీ

ఇండియన్ ఐడల్‌లో తన గానంతో దుమ్మురేపుతున్న సన్నీ ఓ బస్ స్టేషన్ వద్ద బూట్లు పాలిష్ చేస్తూ ఉంటాడు. తన తల్లి పక్కనే బెలూన్లు అమ్ముతుంటుంది. తండ్రి మరణం తర్వాత సన్నీ కుటుంబానికి పుట్టెడు కష్టాలు వచ్చాయి. ఇళ్లు గడవడం కష్టమైపోయింది. అయితే సన్నీకి పాటలన్నా పాటలు పాడటమన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆయన్ను ఇండియన్ ఐడల్‌ స్టేజ్‌ వరకు తీసుకొచ్చింది. అయితే పాటల కోసం తాను ఎవరి దగ్గర శిక్షణ పొందింది లేదు. అంత ఆర్థిక స్థోమత కూడా సన్నీ కుటుంబానికి లేదు. ఇక లెజండరీ సింగర్ నుస్రత్ ఫతే అలీఖాన్ పాడిన "అఫ్రీన్ అఫ్రీన్" అనే పాటను తన గొంతుతో పాడితే సోషల్ మీడియాలో ఆ సాంగ్ వైరల్ అయ్యింది.

 ఇండియన్ ఐడల్‌కు సొంతంగా అప్లై చేసుకున్న సన్నీ

ఇండియన్ ఐడల్‌కు సొంతంగా అప్లై చేసుకున్న సన్నీ

చిన్నప్పటి నుంచి సన్నీకి పాటలు పాడటమంటే ఇష్టమని తల్లి సోమదేవి చెప్పింది. సంగీతంపై ఆసక్తిని గమనించి సన్నీకి తన తండ్రి ఒక హార్మోనియం పెట్టె కూడా కొనిచ్చారని చెప్పుకొచ్చింది. ఇండియన్ ఐడల్‌కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి తనే సొంతంగా దరఖాస్తు చేసుకున్నాడని తల్లిచెప్పింది. తండ్రి చనిపోయాక రూ.2.50 లక్షలు అప్పు ఉండటంతో ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చి ఓ చిన్న స్థలం కొనుకున్నట్లు చెప్పింది. అక్కడే ఓ రెండు గదులతో కూడిన ఇళ్లు నిర్మించుకున్నామని అయితే కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో అధికారులు విద్యుత్ నిలిపివేశారని వెల్లడించింది. చిన్నతనంలో కొన్ని ఖవ్వాలీ పాటలు పాడుతుంటే తనను గుర్తించిన కొందరు స్టేజ్‌పై పాడించారని సన్నీ చెప్పాడు. ఆరవ తరగతి వరకు తను చదువుకున్నట్లు చెప్పాడు.

సన్నీ ఆడిషన్స్ వీడియోను ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర

సీన్ కట్ చేస్తే...సన్నీ ఆడిషన్స్ సందర్భంగా పాడిన ఓ అద్భుతమైన పాటను మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనందర్ మహీంద్ర ట్వీట్ చేశారు. జీవితంలో ఎదిగుతున్నవారి గురించి తెలుసుకునేందుకు దీపావళి మంచి రోజు అని చెబుతూ తన మిత్రుడు ఒకరు ఈ వీడియోను పంపారని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వీడియో చూస్తే కళ్ల నుంచి నీళ్లు ఆగవంటూ చెప్పుకొచ్చారు. వీడియోలో సన్నీ చెబుతున్న కథను చూస్తే కన్నీళ్లు ఆగవు. ఆడిషన్స్‌లో అఫ్రీన్ అఫ్రీన్ పాట పాడి తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు సన్నీ. ఈ ట్వీట్ వైరల్ అవడంతో షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ కూడా ట్వీట్ చేస్తూ ఇండియన్ ఐడల్ షోకు రావాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు.

సన్నీకి గోల్డెన్ మైక్ ప్రధానం

ఇక సన్నీ నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడిన "అఫ్రీన్ అఫ్రీన్" అనే పాట పాడటం పూర్తవగానే జడ్జీలు ఫిదా అయ్యారు. జడ్జీలు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై నుస్రత్ ఫతే అలీఖాన్ పాడినట్లుందని మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్ కితాబిచ్చారు. ఇక సన్నీని మరో జడ్జి నేహా కక్కర్ అభినందిస్తున్న సమయంలో చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తనకు మైండ్ బ్లాక్ అయ్యిందని మరో మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ అన్నారు. ఇంకో పాట పాడాల్సిందిగా సన్నీని కోరడంతో హాల్ ఈ దిల్ అనే పాట పాడి జడ్జీలను ఆకట్టుకున్నాడు. వెంటనే స్టేజ్‌పైకి వచ్చిన విశాల్ గోల్డెన్ మైక్‌ను సన్నీకి బహూకరించారు. గోల్డెన్ మైక్ వచ్చిందంటే థియేటర్‌ రౌండ్‌కు డైరెక్ట్ ఎంట్రీ సాధించినట్లే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Idol 11 contestant Sunny, a shoeshiner from Bathinda, left Anand Mahindra in tears with his moving story. The video that Mahindra shared has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more