వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్ గోయల్: పేదల కోసం రూ.600 కోట్లు, ఇల్లు మాత్రమే ఉంచుకొని,

|
Google Oneindia TeluguNews

రేయింబవళ్లు కష్టపడితే సంపాదన.. ఎవరికైనా.. మరీ వారిలో కొందరే దానం చేస్తారు. ఇవ్వాలనే గుణం అందరికీ ఉండదు. ముఖ్యంగా పేదలను చూసి చలించేవారు అరుదు. లక్షను 10 లక్షలు, కోటిని 10 కోట్లను చేద్దామని అంతా అనుకుంటారు. కానీ వందల కోట్లను ఇవ్వడం రేర్.. కానీ దానికి డాక్టర్ అరవింద్ గోయల్ మినహాయింపు.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తులను రాసిచ్చారు. అంతేకాదు అతనికి ఫ్యామిలీ కూడా అండగా నిలిచింది.

 50 ఏళ్లు కష్టపడి..

50 ఏళ్లు కష్టపడి..


గోయల్ వ్యాపారవేత్త.. వందల కోట్లు సంపాదించారు. అయినా ఎక్కడో వెలితి.. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నా సరే.. దానం చేయడంలో ఆయనకు ఉన్న సంతోషం మరే దాంట్లో లేదు. పేదలకు దానం చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని.. అదీ ఇప్పటికీ కుదిరిందని చెప్పారు. తన ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు. వాటి విలువ రూ.600 కోట్లు అవుతుంది. ఇందుకోసం ఆయన 50 ఏళ్లకు పైగా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు పేదలకు చిరు నవ్వుతో అందజేశారు

 వద్దంటారు.. కానీ

వద్దంటారు.. కానీ


నిజానికి అంత మొత్తంలో ఆస్తి ఇస్తామని చెబితే ఎవరైనా సరే వద్దంటారు. మరీ గోయల్ ఫ్యామిలీ మాత్రం అలా అనలేదు. ఎందుకంటే వారికి ఆయన గురించి తెలుసు కదా.. ఆయన దానం చేయడానికి గల బలమైన కారణం కూడా ఉంది. ఒకసారి డిసెంబర్ నెలలో రైలులో వెళుతున్నాడట. ఒక పేదవాడు చలితో వణుకుతుండటంతో.. షూ ఇచ్చాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడటలేదు.. అప్పుడే.. పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని గోయల్ చెబుతున్నాడు.

100కు పైగా సంస్థలు

100కు పైగా సంస్థలు


గోయల్ దాదాపు 100 ఇనిస్టిట్యూట్స్‌కు ట్రస్టీగా ఉన్నారు. దశాబ్ద కాలం నుంచి సంక్షేమ, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓల్డేజ్ హోమ్, హాస్పిటల్స్, వందకుపైగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవీ ఒక ఉత్తరప్రదేశ్ కాదు.. రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. కరోనా సమయలో కూడా మొరదాబాద్‌లో గల 50 గ్రామాలను దత్తత తీసుకున్నాడు. వారికి ఉచితంగా ఆహారం, మందులు, ఇతర అవసరాలను తీర్చారు.

ఒక ఇల్లు మాత్రమే

ఒక ఇల్లు మాత్రమే


ఇప్పుడు గోయల్ వద్ద ఒక మొరాదాబాద్‌లో గల కోఠి వద్ద కాటేజ్ ఉంది. మిగతా ఆస్తిని అంతా యూపీ ప్రభుత్వానికి అందజేశారు. ఆస్తి విక్రయానికి సంబంధించి ఐదుగురు సభ్యుల చేత కమిటీని ఏర్పాటు చేశారు. వీరిలో ముగ్గురు గోయల్ నియమించగా.. ఇద్దరినీ ప్రభుత్వం ఎంపిక చేస్తోంది. అతని ఆస్తి చివరి రూపాయి కూడా పేదలకు దక్కాలనే ఉద్దేశంతో ఇలా చేశారు. గోయల్ చేసిన మంచి పని పట్ల అతని భార్య, కుమారులు, కుమార్తె చాలా సంతోషంగా ఉన్నారు.

English summary
Dr. Goyal has been helping the poor for a long time. Now he donated the entire property for the welfare of the people. He has given this donation directly to the Uttar Pradesh government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X