మోడీ కీలక నిర్ణయం: జమ్మూ కశ్మీర్ నుంచి.. 10 వేల మంది శరణార్థ ముస్లింలు వెనక్కి

శరణార్థులుగా కాలం గడుపుతున్న 10 వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్ కు పంపించివేయాలని మోడీ సర్కారు నిర్ణయా తీసుకోనుంది.

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ లో ఎంతో కాలంగా శరణార్థులుగా కాలం గడుపుతున్న 10 వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్ కు పంపించివేయాలని మోడీ సర్కారు నిర్ణయా తీసుకోనుంది. జమ్మూ కశ్మీర్ లెక్కల ప్రకారం... సుమారు 10 వేల మంది రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్నారు. ఇక దేశ వ్యాప్తంగా వీరి సంఖ్యం 40 వేల వరకు ఉండొచ్చని అంచనా.

సాధ్యమైనంత త్వరగా వారిని గుర్తించి, దేశం నుంచి పంపించి వేసేందుకు అవసరమై చర్యల దిశగా ఉపక్రమించాలంటూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దశాబ్దాల నాడు మయన్మార్ నుంచి మన దేశంలోకి వచి్చన రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు జమ్మూ, సాంబా జిల్లాల్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

Centre exploring ways to deport 40,000 Rohingya Muslims

వీరంతా చట్ట వ్యతిరేకంగా భారత్-బంగ్లాదేశ్, భారత్-మయన్మార్ సరిహద్దులు దాటడం ద్వారా.. లేదంటే బంగాళాఖాతం మీదుగా ప్రయాణం చేసి భారత్ లోకి ప్రవేశించిన వారు. వీరిని తిరిగి పంపించివేసే దిశగా.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, జమ్మూ కశ్మీర్ చీఫ్ సెక్రటరీ బ్రజ్ రాజ్ శర్మ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వెయిద్ ల నడుమ కీలక చర్చలు జరిగాయి.

రోహింగ్యా ముస్లింలను ఎలా గుర్తించాలన్నదే పెద్ద సమస్య. దీనికీ మార్గాన్వేషణ జరుగుతోందని హోం శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. వీరిలో కొంతమంది ఐరాస శరణార్థ సంఘంలో రిజిస్టర్ చేసుకున్నా, వీరిని గుర్తించేందుకు భారత్ నిరాకరిస్తూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+