వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో శుభవార్త: తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో మరో సంచలనానికి రెఢీ అవుతోంది. తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి రిలయన్స్ జియో ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్

రిలయన్స్ జియో సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.ఉచిత వాయిస్‌కాల్స్, ఉచిత డేటాలతో మార్కెట్లోకి ప్రవేశించి సంచలనాలను సృష్టించింది.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

జియో తీరుతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లలో మార్పులు కూడ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

జియో‌ షాక్: 30 శాతం క్షీణించిన ఇంటెక్స్ విక్రయాలుజియో‌ షాక్: 30 శాతం క్షీణించిన ఇంటెక్స్ విక్రయాలు

అంతేకాదు ప్రత్యర్థులను చిత్తు చేసేందుకుగాను రిలయన్స్ జియో వినూత్న ఆలోచనలతో ముందుకువస్తోంది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ జియోకు చెక్ పెట్టేందుకుగాను కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

శుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియోశుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియో

 చౌకగా జియో 4జీ స్మార్ట్‌ఫోన్

చౌకగా జియో 4జీ స్మార్ట్‌ఫోన్

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై రిలయన్స్ జియో కేంద్రీకరించింది. ఫీచర్‌ ఫోన్‌ మాదిరి తరహలోనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని జియో యోచిస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన చిప్‌ తయారీ కంపెనీ స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్‌ కంపెనీతో చర్చలు జరిపింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్‌ లియో లి ధృవీకరించారు. రిలయన్స్ జియో అందించే 4జీ హ్యాండ్‌సెట్‌కు పరికరాలను సరఫరాల చేయడం కోసం జియో స్ప్రెడ్‌ట్రమ్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే జియో ఫీచర్‌ఫోన్‌కు పరికరాలను ఈ కంపెనీయే సరఫరా చేస్తోంది.

ఈ ఏదాది చివర్లో మార్కెట్లోకి జియో 4జీ

ఈ ఏదాది చివర్లో మార్కెట్లోకి జియో 4జీ

ఈ ఏడాది చివరినాటికి షాంఘైకి చెందిన తమ కంపెనీ జియోకు 10 మిలియన్‌ 4జీ ఫీచర్‌ ఫోన్లకు చిప్స్‌ను సరఫరా చేయనుందని లియో లి తెలిపారు. ఈ చిప్స్ అందిన తర్వాత పోన్లను మార్కెట్లోకి విడుదల చేయాలని రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది.

4 అంగుళాల స్క్రీన్

4 అంగుళాల స్క్రీన్

అతి తక్కువ ధరలో జియో తీసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్‌ 4 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని లి తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఇంకా జియో ధృవీకరించలేదు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ అత్యంత ముఖ్యమైన మార్కెట్‌ అని లి తెలిపారు. తాము జియోతో కలిసి చాలా సన్నిహితంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.తక్కువ ధరకే 4జీ ఫీచర్‌ఫోన్లను అందిస్తున్నట్టు లి చెప్పారు.

10 మిలియన్ డివైజ్‌ల విక్రయం

10 మిలియన్ డివైజ్‌ల విక్రయం

ఈ ఏడాది చివరి నాటికి 10 మిలియన్‌ డివైజ్‌లను విక్రయించాలని జియో ప్లాన్ చేస్తోంది.రిలయన్స్‌ రిటైల్‌లో మూడేళ్ల డిపాజిట్‌ కింద రూ.1500 కట్టి ఈ డివైజ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. తాజాగా జియో అత్యంత చౌకగా స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించబోతున్నట్టు స్ప్రెడ్‌ట్రమ్‌ పేర్కొంది. మరోవైపు స్థానిక హ్యాండ్‌సెట్‌ తయారీదారులతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని స్ప్రెడ్‌ట్రమ్‌ చూస్తోంది.

English summary
Reliance Jio Infocomm is readying a lowcost 4G smartphone, said the chairman of Chinese chipmaker Spreadtrum Communications, which is in talks to supply components for the handset. The Shanghai-headquartered company will supply chips for 10 million 4G feature phones by the end of the year that Leo Li said the telco will sell in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X