5 రాష్ట్రాల సమరానికి సై, సెమీ ఫైనల్స్ - ఎవరిది పై చేయి...!!
జాతీయ రాజకీయాల్లో అసలైన సమరానికి ముహూర్తం ఖరారైంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు విడుదల కానుంది. ఈ సాయంత్రం ఎన్నికల సంఘం ఈ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న ఎన్డీఏకు ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. ఈ ఎన్నికలు 2029 ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా నిలవనున్నాయి.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, అస్సాం లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించిన ఎన్నికల కమిషన్ అక్కడ ఏర్పాట్ల పైన సమీక్ష చేసింది. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటకు సిద్దమైంది. తమిళనాడు రెండు విడతల్లో, పశ్చిమ బెంగాల్ ఆరు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ నెలాఖరు కు ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లో ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ఈ సారి బీజేపీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా తమిళనాడులో అన్నా డీఎంకేతో జత కట్టింది. బెంగాల్ లో తాజా పరిణామలు తమకు కలిసి వస్తాయని లెక్కలు వేస్తోంది.

రెండు కూటములకు ప్రతిష్ఠాత్మకం
కాగా, తమిళనాడులోనూ ఈ సారి హోరా హోరీగా పోరు మారే అవకాశం కనిపిస్తోంది. అక్కడ సినీ హీరీ విజయ్ టీవీకే పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. విజయ్ తమ పార్టీకి ఎవరితో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. అటు బీజేపీతో జత కట్టిన అన్నా డీఎంకే నేతలు వరుసగా డీఎంకే లో చేరుతున్నారు. స్టాలిన్ తిరిగి పీఠం నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటటం ద్వారా బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న నేతలు.. వేసవిలో ఎన్నికల వేడి మరింత పెంచేలా ప్రచార షెడ్యూల్ ను ఫిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు ఈ ఎన్నికలు పరీక్షగా మారుతన్నాయి. ఇండియా కూటమి పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా మారటంతో.. గెలుపు మరింత కీలకంగా మారనుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
బెంగాల్లోజడ్జీలనే బంధిస్తారా ? సీబీఐ/ఎన్ఏఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశాలు..! -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి -
ఐప్యాక్ కు భారీ దెబ్బ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications